NBK109: బాలయ్య మరో మాస్ రాంపేజ్ అప్‌డేట్.. పిక్ అదిరింది

ABN , First Publish Date - 2023-11-08T10:46:58+05:30 IST

‘భగవంత్ కేసరి’ బ్లాక్‌బస్టర్ విజయంతో దూకుడు మీదున్న నందమూరి నటసింహం మరో మాస్ రాంపేజ్‌కు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టిన బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. NBK109గా తెరకెక్కనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుండి ప్రారంభమైనట్లుగా మేకర్స్ తెలియజేశారు.

NBK109: బాలయ్య మరో మాస్ రాంపేజ్ అప్‌డేట్.. పిక్ అదిరింది
NBK109 Movie Update

‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) బ్లాక్‌బస్టర్ విజయంతో దూకుడు మీదున్న నందమూరి నటసింహం మరో మాస్ రాంపేజ్‌కు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiah) చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టిన బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. NBK109గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఫార్చున్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి టాలీవుడ్‌ అగ్రగామి సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. ఈ సినిమాను ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్‌గా ప్రారంభించారు. నేడు (బుధవారం) ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్ వదిలారు.

Bala.jpg

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. కారణం.. బాలయ్య అనగానే గుర్తొస్తే పేరు మాస్. ఆ పదానికి పర్ఫెక్ట్ మీనింగ్ అనేలా.. గొడ్డలికి కళ్లజోడు పెట్టి వదిలారు. అంటే.. ఇందులో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందీ అనేదానికి ఉదాహరణగా ఈ పోస్టర్ నిలుస్తోంది. ఈ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్‌లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు. అలాగే ఈ అప్‌డేట్‌తో పాటు మేకర్స్ వదిలిన క్యాప్షన్స్ కూడా సినిమాపై భారీ అంచనాలకు కారణమవుతున్నాయి. లైట్, కెమెరా, యాక్షన్ అని చెబుతూ.. ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్’, ‘వయలెన్స్‌ కా విజిటింగ్‌ కార్డ్‌’ అంటూ బాలయ్య, బాబీల సినిమా నేటి నుంచి షూటింగ్ మొదలైందని మేకర్స్ తెలిపారు. (NBK109 Poster)


NBK109.jpg

అంతకు ముందు చిత్ర అనౌన్స్‌మెంట్‌కి సంబంధించి వదిలిన పిక్ కూడా ఈ సినిమాపై క్రేజ్ పెంచడానికి కారణమైంది. ఓ సూట్‌కేస్‌లో కత్తి, గొడ్డలి, సుత్తి వంటి ఆయుధాలతోపాటు మందు బాటిల్‌, సిగిరెట్‌ పెట్టె ఉన్నాయి. ‘ప్రపంచానికి అతను తెలుసు.. కానీ ఎవరికీ అతని ప్రపంచం తెలీదు’ అనే క్యాప్షన్ జోడించారు. ఆ పిక్‌తో పాటు, ఇప్పుడు వదిలిన పిక్ చూస్తుంటే.. బాలయ్యతో బాబీ (Bobby) గట్టిగానే ప్లాన్ చేశాడనేది అర్థమవుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. (NBK109 Update)


ఇవి కూడా చదవండి:

========================

*Dum Masala: ‘గుంటూరు కారం’ దమ్ మసాలా సాంగ్ టాకేంటి?

*************************************

*Ranjana: అందుకే విద్యార్థులను కొట్టా.. నటి రంజనా సంచలన వ్యాఖ్యలు

*************************************

Updated Date - 2023-11-08T11:45:31+05:30 IST