RAM: జనవరి 26న.. దేశ భక్తిని చాటే చిత్రం

ABN , Publish Date - Jan 20 , 2024 | 06:19 PM

దేశ భక్తిని చాటే చిత్రాలు ఈ మధ్య చాలా అరుదుగా వస్తున్నాయి. టాలీవుడ్‌లో ఈ జానర్‌లో ఎక్కువగా చిత్రాలను తెరకెక్కించేందుకు సాహసం చేయరు. ఆ సాహసాన్ని చేస్తూ ‘రామ్’ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రాన్ని తెరకెక్కించారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

RAM: జనవరి 26న.. దేశ భక్తిని చాటే చిత్రం
Rapid Action Mission Movie Still

దేశ భక్తిని చాటే చిత్రాలు ఈ మధ్య చాలా అరుదుగా వస్తున్నాయి. టాలీవుడ్‌లో ఈ జానర్‌లో ఎక్కువగా చిత్రాలను తెరకెక్కించేందుకు సాహసం చేయరు. ఆ సాహసాన్ని చేస్తూ ‘రామ్’ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రాన్ని తెరకెక్కించారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా తెరకెక్కిన ఈ చిత్రంతో.. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల (Surya Ayyalasomyajula) హీరోగా పరిచయం అవుతుండగా.. ధన్యా బాలకృష్ణ (Dhanya Balakrishna) హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ అప్‌డేట్‌ను మేకర్స్ వదిలారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా.. ఇదొక దేశభక్తి చిత్రమని చెబుతూ.. మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీని రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తే బాగుంటుందని, ఇలాంటి దేశ భక్తిని చాటే చిత్రాలు అలాంటి రోజున వస్తేనే బాగుంటుందని మేకర్లు భావించి.. అదే రోజున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. (Rapid Action Mission Release Date)


Rapid-Action-Mission.jpg

పేట్రియాటిక్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ జానర్ల‌ను ఇష్టపడే ఆడియెన్స్‌కి సైతం నచ్చేలా రామ్‌ను రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. (RAM Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

****************************

*Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

**************************

*Hansika: 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో..

***************************

*Nayanthara: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణలు చెప్పిన నయనతార

****************************

Updated Date - Jan 20 , 2024 | 06:19 PM