Kannappa: ‘కన్నప్ప’ సెట్‌లో ప్రభాస్.. పోస్టర్ వైరల్

ABN , Publish Date - May 09 , 2024 | 05:17 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్‌ వంటి టాప్ స్టార్ ఇప్పటికే ‘కన్నప్ప’ సెట్‌లో అడుగు పెట్టి వారి షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ వంతొచ్చింది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లుగా చెబుతూ.. విష్ణు మంచు అధికారికంగా ఓ పోస్ట్ చేశారు.

Kannappa: ‘కన్నప్ప’ సెట్‌లో ప్రభాస్.. పోస్టర్ వైరల్
Prabhas Joins Kannappa Shoot

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్‌ వంటి టాప్ స్టార్ ఇప్పటికే ‘కన్నప్ప’ సెట్‌లో అడుగు పెట్టి వారి షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) వంతొచ్చింది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లుగా చెబుతూ.. విష్ణు మంచు అధికారికంగా ఓ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్‌లో రెబల్ స్టార్ అడుగుపెట్టిన పోస్టర్‌ని కేవలం కాలు మాత్రమే చూపించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైలర్ అవుతోంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ (Manchu Vishnu Dream Project) అయిన ఈ ‘కన్నప్ప’ను మోహన్ బాబు (Mohan Babu) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు.


Prabhas.jpg

‘కన్నప్ప’లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్.. అలరించే కథ, కథనాలతో హై స్టాండర్డ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు జరిగిన షూట్ విషయంలో చిత్రయూనిట్ చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Updated Date - May 09 , 2024 | 05:17 PM