Kannappa: క‌న్న‌ప్ప‌కు.. హీరోయిన్ దొరికేసింది.. ఎవ‌రంటే?

ABN , First Publish Date - 2023-12-14T17:14:34+05:30 IST

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ కన్నప్ప ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా మేకర్స్ మరో ప్రకటన చేశారు. ఈ చిత్రంలో విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు వెళ్ల‌డించారు.

Kannappa: క‌న్న‌ప్ప‌కు.. హీరోయిన్ దొరికేసింది.. ఎవ‌రంటే?
Preity Mukhundhan

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వ‌స్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా బ‌జ్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ కన్నప్ప ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా మేకర్స్ మరో ప్రకటన చేశారు. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు వెళ్ల‌డించారు. ఈ మేరకు ఆమెను టీంలోకి స్వాగతిస్తూ కన్నప్ప చిత్ర యూనిట్ ఓ పోస్టు పెట్టింది.

మొద‌ట‌గా క‌థానాయిక‌గా ఎంపికైనా నుపుర్ స‌న‌న్ డేట్స్ అడ్జ‌స్ట్ కాక సినిమా నుంచి త‌ప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ఇటీవ‌ల చిత్రయూనిట్ ప్రీతి ముకుందన్ (PreityMukhundhan) కు అన్ని రకాల‌ ఆడిషన్స్ నిర్వహించి సినిమాలో కీలక పాత్రకు స‌రిపోతుంద‌ని భావించి ఎంపిక చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి.. తన భరతనాట్య కళతో పాత్రకు ప్రాణం పోయనుంద‌ని, ‘కన్నప్ప’ (Kannappa)లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్య నైపుణ్యం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుందని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.


ఈ సంద‌ర్భంగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..‘ప్రీతీ (Preity Mukhundhan)కి ఇది తొలి సినిమా మాత్రమే కాదని, కళ, సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకుని ఈ ప్రపంచంలోకి వచ్చిందన్నారు.. ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది’ అని అన్నారు.

అయితే ఈ చిత్రంలో మోహన్‌లాల్ (Mohanlal), శివ‌రాజ్ కుమార్ (Shiva Rajkumar), ప్రభాస్ (Prabhas ), మోహ‌న్‌బాబు (MohanBabu), శ‌ర‌త్ కుమార్‌ వంటి ఆగ్ర తార‌లు నటిస్తుండ‌డంతో ప్రీతి (Preity Mukhundhan) కెరీర్ మరో స్థాయికి వెళ్లే అవ‌కాశాలు పుఉష్క‌లంగా ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్రితీ త‌మిళంలో కెవిన్ స‌ర‌స‌న స్టార్ అనే ఓ చిత్రంలో న‌టిస్తున్న‌ది.

Updated Date - 2023-12-14T17:22:03+05:30 IST