Kannappa: క‌న్న‌ప్ప ఫ‌స్ట్‌ లుక్‌.. మంచు విష్ణు అద‌ర‌గొట్టాడుగా

ABN , Publish Date - Mar 08 , 2024 | 03:14 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా మూవీ మేక‌ర్స్‌ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిన్న‌ ప్ర‌క‌టించ‌గా.. ఈ రోజు అదే స‌మ‌యానికి విడుద‌ల చేశారు.

Kannappa: క‌న్న‌ప్ప ఫ‌స్ట్‌ లుక్‌.. మంచు విష్ణు అద‌ర‌గొట్టాడుగా
manchu vishnu

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). పూర్తిగా న్యూజిలాండ్ (New Zealand) లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను ఇటీవ‌లే ప్రారంభించారు. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా మూవీ మేక‌ర్స్‌ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిన్న‌ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో ఈ రోజు చిత్ర యూనిట్ చెప్పిన విధంగానే క‌రెక్ట్‌గా చెప్పిన స‌మ‌యానికి మధ్యాహ్నం 2.55 గంట‌ల‌కు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు.

Manchu-Vishnu-Kannappa.jpg


ఈ లుక్‌లో మంచు విష్ణు క‌న్న‌ప్ప గెట‌ప్‌లో ఓ భారీ జ‌ల‌పాతం క్రింద విల్లును ఎక్కుపెట్టినట్లుగా ఉండి సినీ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో మోహ‌న్ లాల్, మోహ‌న్‌బాబుల‌తో పాటు ఇండియాలోని టాప్ స్టార్లు, హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ప‌ని చేస్తుండ‌గా, మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ (Mukesh Kumar Singh) దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

Updated Date - Mar 08 , 2024 | 03:17 PM