Kannappa: న్యూజిలాండ్‌లో మొదలైన ‘కన్నప్ప’ సెకండ్ షెడ్యూల్.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:23 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ మేరకు చిత్రయూనిట్ న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్టుగా తెలిపారు. ఆల్రెడీ న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ చిత్రీకరణ జరిపిన విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్రయూనిట్ అంతా ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకున్న ‘కన్నప్ప’ టీం మళ్లీ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది.

Kannappa: న్యూజిలాండ్‌లో మొదలైన ‘కన్నప్ప’ సెకండ్ షెడ్యూల్.. వీడియో వైరల్
Kannappa Team at New Zealand

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa) రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ మేరకు చిత్రయూనిట్ న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్టుగా తెలిపారు. ఆల్రెడీ న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ చిత్రీకరణ జరిపిన విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్రయూనిట్ అంతా ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకున్న ‘కన్నప్ప’ టీం మళ్లీ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది.

ఈ మేరకు న్యూజిలాండ్‌ (New Zealand)లో దిగిన విష్ణు మంచు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్ బాబు (Mohan Babu), విష్ణు మంచు కనిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ రెండో షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా ఈ సినిమాను మంచు ఫ్యామిలీ తెరకెక్కిస్తోంది. న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. (Kannappa Second Schedule Starts)


Vishnu-Manchu.jpg

న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెందరో నటిస్తున్నారు. ‘మహాభారతం’ (Maha Bharatham) సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sree Vishnu: ‘రాజ రాజ చోర’ కాంబినేషన్ రిపీట్.. ఈసారి అచ్చతెలుగు సినిమా!

**************************

*Save The Tigers: ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 1’ ఫ్రీ స్ట్రీమింగ్.. ఎప్పటి వరకంటే?

******************************

*BBN: రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్.. సక్సెస్‌పై నమ్మకంగా ఉన్న చిత్రయూనిట్..

**************************

Updated Date - Feb 28 , 2024 | 04:28 PM