Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’.. కీల‌క‌ అప్‌డేట్

ABN , Publish Date - Mar 07 , 2024 | 03:38 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ . పూర్తిగా న్యూజిలాండ్‌లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుప‌కుంటున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను ఇటీవ‌లే ప్రారంభించారు. తాజాగా మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు.

Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’.. కీల‌క‌ అప్‌డేట్
Kannappa

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa). పూర్తిగా న్యూజిలాండ్‌ (New Zealand) లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుప‌కుంటున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను ఇటీవ‌లే ప్రారంభించారు. మోహ‌న్‌లాల్ మోహ‌న్‌బాబుల‌తో పాటు ఇండియాలోని టాప్ స్టార్లు, హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ప‌ని చేస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ (Mukesh Kumar Singh) దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.


తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి 8 శుక్ర‌వారం మధ్యాహ్నం 2.55 గంట‌ల‌కు ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

Updated Date - Mar 07 , 2024 | 03:38 PM