Rakshana Teaser: పాయ‌ల్ రాజ్‌పుత్‌ వార్నింగ్ అదిరింది..

ABN , Publish Date - May 21 , 2024 | 09:19 PM

‘‘వాడెవ‌డో తెలియ‌దు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను క‌చ్చితంగా వాడిని క‌ల‌వ‌లేదు.. ఏరోజు నేను వాడ్ని క‌లుస్తానో అదే అఖ‌రి రోజు’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఇంత‌కీ పాయల్ అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవ‌రికీ? ఎందుకోసం.. ఎవ‌రినీ ఆమె వెతుకుతుంది? అనే వివ‌రాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేక‌ర్స్‌.

Rakshana Teaser: పాయ‌ల్ రాజ్‌పుత్‌ వార్నింగ్ అదిరింది..
Payal Rajput in Rakshana

‘‘వాడెవ‌డో తెలియ‌దు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను క‌చ్చితంగా వాడిని క‌ల‌వ‌లేదు.. ఏరోజు నేను వాడ్ని క‌లుస్తానో అదే అఖ‌రి రోజు’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది పాయ‌ల్ రాజ్‌పుత్‌ (Payal Rajput). ఇంత‌కీ పాయల్ అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవ‌రికీ? ఎందుకోసం.. ఎవ‌రినీ ఆమె వెతుకుతుంది? అనే వివ‌రాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ (Rakshana) సినిమా చూడాల్సిందేంటున్నారు మేక‌ర్స్‌. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా.. ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. (Rakshana Teaser Out)

*Hema: రేవ్ పార్టీ కవరింగ్ కోసం రెసిపీ.. హేమతో ఆడేసుకుంటోన్న నెటిజన్లు

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఓ హంతకుడు క్రూరంగా హ‌త్య‌లు చేస్తుంటాడు.. అత‌నెవ‌రో క‌నిపెట్టి అరెస్ట్ చేయాల‌ని పోలీస్ ఆఫీస‌ర్ అయిన పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌య‌త్నించే క్రమంలో పై డైలాగ్ హైలెట్ అనేలా టీజర్‌ని కట్ చేశారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌. (Rakshana 2024 Movie)


Payal-Rajput-Rakshana.jpg

ఈ సందర్భంగా ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ (Prandeep Thakore) మాట్లాడుతూ.. ‘రక్షణ’ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇదొక ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ ఇప్పటి వరకు కనిపించని ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథ ఇది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - May 21 , 2024 | 09:19 PM