Payal Rajput: పాయల్‌ రాజ్‌పుత్‌కు షాక్‌.. మా కౌన్సిల్ సీరియ‌స్!లెట‌ర్ విడుద‌ల

ABN , Publish Date - May 20 , 2024 | 07:53 PM

తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ మేకర్స్‌ బెదిరిస్తున్నారని హీరోయిన్  పాయల్‌ రాజ్‌పుత్ ఇన్స్టా గ్రామ్‌లో ఓ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇష్యూ విష‌యంలో స‌ద‌రు నిర్మాత ప్రదీప్‌ ఠాకూర్‌ తెలుగు ఫిల్మ్ ప్రోడ్యూస‌ర్స్ కౌన్షిల్‌ క‌ల‌వ‌డంతో ఇప్పుడు ఈ అంశం కాస్తా హీట్ ఎక్కింది.

Payal Rajput: పాయల్‌ రాజ్‌పుత్‌కు షాక్‌..  మా కౌన్సిల్ సీరియ‌స్!లెట‌ర్ విడుద‌ల
payal

తనకు అన్యాయం చేస్తున్నారంటూ, తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ మేకర్స్‌ బెదిరిస్తున్నారని హీరోయిన్  పాయల్‌ రాజ్‌పుత్ (Payal Rajputh) ఇన్స్టా గ్రామ్‌లో ఓ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా చర్చనీయాంశంగా కూడా మారింది. అయితే తాజాగా ఈ ఇష్యూ విష‌యంలో స‌ద‌రు నిర్మాత ప్రదీప్‌ ఠాకూర్‌ తెలుగు ఫిల్మ్ ప్రోడ్యూస‌ర్స్ కౌన్షిల్‌ క‌ల‌వ‌డంతో ఇప్పుడు ఈ అంశం కాస్తా హీట్ ఎక్కింది.

విష‌యానికి వ‌స్తే.. 'రక్షణ’ (Rakshana) చిత్రాన్ని నాలుగేండ్ల క్రితం ఆరంభించామ‌ని అందుకు పాయ‌ల్ రాజ్‌పుత్ ద‌గ్గ‌ర 50 రోజుల కాల్షిట్లు కూడా తీసుకుని చిత్రాన్ని 47 రోజుల్లోనే పూర్తి చేశామ‌న్నారు. కానీ త‌ర్వాత క‌రోనా ఇత‌ర ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ల్ల సినిమా విడుదల‌కు ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని అన్నారు. అంతేగాక ప్ర‌మోష‌న్స్ పూర్తి కాగానే త‌న‌కు ఇవ్వాల్సిన‌ రూ.6 ల‌క్ష‌ల‌ను ఇస్తామ‌ని తెలిపామని అందుకు గాను ఏప్రిల్ 4 2024 వ తేదీన చెక్ కూడా రెడీ చేసి కౌన్షిల్‌లో డిపాజిట్ చేశామ‌న్నారు. ఏప్రిల్ 19 న సినిమా విడుద‌ల‌కు ప్లాన్ చేసుకుని ప్ర‌మోష‌న్స్‌కు రావాల‌ని పాయ‌ల్‌ను కోరితే.. సినిమా ఓల్డ్ అయింద‌ని ఓటీటీలో విడుద‌ల చేసుకోండ‌ని, ప్ర‌మోష‌న్స్‌కు రాన‌ని తెలిపి రాలేద‌ని అన్నారు. దాంతో నాకు ఆర్థికంగానే కాకుండా ఫ్యామిలీ ప‌రంగా కూడా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చిందంటూ నిర్మాత ప్రదీప్‌ ఠాకూర్‌ తెలుగు ఫిల్మ్ ప్రోడ్యూస‌ర్స్ కౌన్షిల్‌ కి ఫిర్యాదు చేశారు.

11.jpeg


దీనికి వారు స్పందిస్తూ.. నిర్మాత ప్రదీప్‌ ఠాకూర్ ఫిర్యాదు అందింద‌ని అయితే ఈ ఇష్యూ గురించి మా అసోసియేష‌న్‌కు తెలిపామ‌న్నారు. అక్క‌డ వారు దానిని ప‌రిశీలించి పాయ‌ల్ మా అసోషియేష‌న్‌, కౌన్షిల్‌లో మెంబ‌ర్‌ కాక‌పోవ‌డంతో ఫిల్మ్‌ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లగా అగ్రిమెంట్ ప్ర‌కారం పాయ‌ల్ ప్ర‌మోష‌న్‌లో పాల్గొనాల‌ని, నిర్మాత బ్యాలెన్స్ ఎమౌంట్ చెల్లించాల‌ని 12.04.2024 స‌జెస్ట్ చేసిన‌ట్లు తెలిపింది. అదే రోజు ఈ విష‌యాన్ని పాయ‌ల్ దృష్టికి తీసుకెళితే విముఖ‌త చెప్పింద‌ని అన్నారు. త‌ర్వాత నిర్మాత ,ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యుస‌ర్ పాయ‌ల్ రాజ్‌పుత్‌ను, మేనేజ‌ర్‌ను కాంటాక్ట్ అయి స‌మ‌స్య‌ను తీర్చుకోవ‌డానికి 18.05.2024న ప్ర‌య‌త్నించినా పాయ‌ల్ సుముఖ‌త చూపించ‌లేద‌నన్నారు.

22.jpeg

తెల్లారే పాయ‌ల్ రాజ్‌పుత్ (Payal Rajput) సోష‌ల్ మీడియా వేదిక‌గా నా విష‌యంలో అన్యాయం చేస్తున్నారంటూ, తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్న‌ట్లు మాట్లాడింద‌న్నారు. పాయ‌ల్ చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను మేం తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని కౌన్సిల్ నుంచి అలాంటి ఎ స్టేట్మెంట్లు ఇవ్వ‌లేద‌ని మొద‌టి నుంచి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నామ‌ని అన్నారు. నిర్మాత ప్రదీప్ ఠాకోర్ మరియు పాయల్ రాజ్‌పుత్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆమె "రక్షణ" చిత్రంలో ఆమె నటించింది కాబట్టి ఆమె పేరును తన సినిమాలో ఉపయోగించడం నిర్మాత యొక్క ప్రత్యేక హక్కు అని అన్నారు. ఇంకా, ఈ చిత్రం పోస్టర్ విడుదల మరియు టీజర్ లాంచ్ గురించి నిర్మాత మా కౌన్సిల్‌కి తెలియజేశారని పేర్కొన్నారు.

Updated Date - May 20 , 2024 | 07:57 PM