Padamati Kondallo: ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ వదిలిన మెగా హీరో

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:25 PM

అనురూప్ కటారి హీరోగా విన్విత ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్‌పై జయకృష్ణ దురుగడ్డ నిర్మించిన చిత్రం ‘పడమటి కొండల్లో’. నరేష్ పెంట ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Padamati Kondallo: ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ వదిలిన మెగా హీరో
Padamati Kondallo First Look

అనురూప్ కటారి (Anuroop Katari) హీరోగా విన్విత ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్‌పై జయకృష్ణ దురుగడ్డ (Jayakrishna Durugadda) నిర్మించిన చిత్రం ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). నరేష్ పెంట (Naresh Penta) ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Hero Sai Durga Tej) ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

*Kavya Kalyanram: 'బలగం' భామ భలే వుంది, మీరూ చూసెయ్యండి !


ఈ ‘పడమటి కొండల్లో’ పోస్టర్‌లో అనురోప్ కటారి లుక్, గెట‌ప్‌ చాలా గంభీరంగా ఉన్నాయి. హీరో రౌద్ర రస హావభావాలతో రక్తం అంటిన కత్తి పట్టుకుని నడుస్తున్నట్లుగా ఈ పిక్ ఉంది. ఈ పిక్ చూస్తుంటే.. అక్కడ పెద్ద విధ్వంసమే జరిగినట్లుగా అనిపిస్తోంది. మాస్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండమనేలా ప్రేక్షకులను అలెర్ట్ చేస్తున్నట్లుగా ఈ పిక్ ఉంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Padamati Kondallo First Look Out)


Anuroop.jpg

ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ‘పడమటి కొండల్లో’ సినిమాతో సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ప్రేక్షకులు పొందుతారని, ఈ చిత్రానికి ఒక మార్క్ ఉంటుందని, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా కొన‌సాగే ఈ చిత్రంలో వుండే ప్రేమ‌క‌థ ఎంతో ఆస‌క్తిక‌రంగా వుంటుంద‌ని తెలిపారు. సినిమా మొత్తం ఒక డిఫ‌రెంట్ అండ్ విజువ‌ల్ ఫీస్ట్‌లా వుండేలా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నామని, త్వరలోనే మరిన్ని అప్డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని వెల్లడించారు. యశస్వి శ్రీనివాస్, శ్రావ్య రెడ్డి, మురళీ కృష్ణంరాజు, లతీష్ జవ్వాది వంటివారు ఈ చిత్రంలో నటిస్తోన్న ఇతర తారాగణం. (Padamati Kondallo Movie)

Read Latest Cinema News

Updated Date - Apr 23 , 2024 | 05:25 PM