Sai Dharam Tej : 'సత్య' ప్రదర్శనతో బీఎల్‌వీడీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మొదలు

ABN , First Publish Date - 2023-12-02T14:59:18+05:30 IST

సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన లఘు చిత్రం ‘సత్య’ ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకుంది. సైనికులకు నివాళులర్పిస్తూ  ‘సోల్‌ ఆఫ్‌ సత్య’ అనే పాటను రూపొందించారు.

Sai Dharam Tej :  'సత్య' ప్రదర్శనతో బీఎల్‌వీడీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మొదలు

సాయిధరమ్‌ తేజ్‌(Sai tej), కలర్స్‌ స్వాతి (Swathi) ప్రధాన పాత్రల్లో నటించిన లఘు చిత్రం ‘సత్య’ (Satya) ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకుంది. సైనికులకు నివాళులర్పిస్తూ  ‘సోల్‌ ఆఫ్‌ సత్య’ (The Soul Of Satya) అనే పాటను రూపొందించారు. ఆగస్టు 15న దీనిని విడుదల చేయగా మంచి వ్యూస్‌తోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ షార్ట్‌ ఫిల్మ్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని తెలుపుతూ సాయిధరమ్‌  తేజ్‌ ఇన్ స్టాలో పోస్ట్‌ చేశారు. 

‘నాకెంతో ఇష్టమైన షార్ట్‌ ఫిల్మ్‌ ‘సత్య’ను.. ఈ నెల 9న హాలీవుడ్‌ బీఎల్‌వీడీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ వేడుకను మా షార్ట్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్తోనే మొదలు పెట్టడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఇది మా టీమ్‌ అందరికీ గర్వకారణం. కాలిఫోర్నియాకు దగ్గరలో ఉండే వాళ్లు ఆ వేడుకకు హాజరై మంచి కాజ్‌ కోసం తీసిన ‘సత్య’ను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్‌ చేశారు. తేజ్‌ పోస్ట్‌ చూసిన అభిమానులు ఈ సినిమా టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇటీవల ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఒనిరోస్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేదికపై ప్రదర్శించగా.. రెండు అవార్డులు దక్కించుకుంది. 

Updated Date - 2023-12-02T15:07:56+05:30 IST