Salloni: ఈ తెలుగునటి ఒకప్పుడు సల్మాన్ ఖాన్ హీరోయిన్, తెలుసా...

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:04 PM

అగ్ర దర్శకుడు రాజమౌళి 'మర్యాద రామన్న' సినిమాలో కథానాయకురాలిగా చేసి, అలాగే ఒకప్పుడు సల్మాన్ ఖాన్ పక్కన 'సావన్: ది లవ్ సీజన్' అనే హిందీ సినిమాలో కథానాయకురాలిగా నటించిన సలోని, ఇప్పుడేమి చేస్తోంది. ఆమె ఏ సినిమాలో నటిస్తోంది, ఆమె తాజా ఫోటోలతో కథనం

Salloni: ఈ తెలుగునటి ఒకప్పుడు సల్మాన్ ఖాన్ హీరోయిన్, తెలుసా...
Actress Salloni

అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన 'మర్యాద రామన్న' అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఆ సినిమాలో కథానాయకురాలు సలోని. ఆ సినిమాలో సునీల్ కథానాయకుడు, ఇంకో ప్రధాన పాత్రలో బ్రహ్మాజీ కనిపిస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించటమే కాకుండా, ఇందులో నటించిన సలోని నటనని అందరూ ప్రశంసించారు.

sallonione.jpg

సలోని అసలు పేరు వందన అని ఎంతమందికి తెలుసు. ముంబైలో పుట్టి పెరిగిన ఆమె ముందుగా హిందీ సినిమా ' దిల్ పరదేశి హో గయా' తో ఆరంగేట్రం చేసింది. తర్వాత 'ధన 51' తో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇందులో సుమంత్ కథానాయకుడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా నడవలేదు. ఈ సినిమా తర్వాత తరుణ్ పక్కన 'ఒక వూరిలో' అనే సినిమా చేసింది సలోని, ఈ సినిమా కూడా విజయం సాధించలేదు.

sallonisix.jpg

సిద్ధార్థ్ తో చేసిన 'చుక్కలో చంద్రుడు' పరవాలేదు అనిపించింది. ఇలా వరసగా తెలుగు సినిమాలు చేస్తున్న సలోని కి హిందీలో సల్మాన్ ఖాన్ పక్కన చేసే అవకాశం వచ్చింది. 'సావన్: ది లవ్ సీజన్' అనే హిందీ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రేయసిగా చేసి అందరి ప్రసంశలు అందుకుంది సలోని. ఎందుకో ఆమె కెరీర్ హిందీలో అంతగా సాగలేదు. ఆ తర్వాత తమిళ్, కన్నడ సినిమాలు చేసి అక్కడ మంచి పేరు సంపాదించింది.

sallonithirteen.jpg

అప్పుడు ఎస్ఎస్ రాజమౌళి తన 'మగధీర' సినిమాలో సలోని కి ఒక చిన్న పాత్ర ఇచ్చారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సలోని చేసిన చిన్న పాత్రకే మంచి ప్రసంశలు రావటంతో, రాజమౌళి ఆమెని తన తదుపరి సినిమా 'మర్యాద రామన్న'లో కథానాయకురాలిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది.

sallonitwo.jpg

ఆ తరువాత అడపా తడపా సినిమాలు చేస్తూనే వుంది సలోని, కానీ పెద్ద బ్రేక్ అయితే మాత్రం ఆమెకి రాలేదు అనే చెప్పాలి. వెంకటేష్ పక్కన నటించిన 'బాడీ గార్డ్' సినిమాలో సలోని చేసిన నటనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సైమా అవార్డు వచ్చింది. 2014లో అల్లు అర్జున్, శృతి హాసన్ నటించిన 'రేసు గుర్రం' సినిమాలో సలోని ఒక కీలక పాత్ర చేసింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది.

sallonieleven.jpg

ప్రస్తుతం వరుణ్ తేజ్, 'పలాస' ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'మట్కా' సినిమాలో సలోని ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇంకో రెండు తెలుగు సినిమాలు చర్చల్లో వున్నట్టుగా తెలుస్తోంది. ఏ భాషలో అయినా మంచి పాత్రలు వస్తే చెయ్యడానికి తాను రెడీ అని చెపుతోంది ఈ భామ.

Updated Date - Apr 25 , 2024 | 04:48 PM