Varun Tej 14: అట్టహాసంగా మొదలైన వరుణ్ తేజ్ కొత్త సినిమా 'మట్కా', పరిశ్రమనుండి అతిరథమహారధులు హాజరు

ABN , First Publish Date - 2023-07-27T13:02:18+05:30 IST

వరుణ్ తేజ్, 'పలాస' ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ కాంబినేషన్లో ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన వరుణ్ తేజ్ 14వ సినిమాకి 'మట్కా' అనే టైటిల్ పెట్టారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయకురాలు, కాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఒక ముఖ్య పాత్రలో కనపడనున్నది

Varun Tej 14: అట్టహాసంగా మొదలైన వరుణ్ తేజ్ కొత్త సినిమా 'మట్కా', పరిశ్రమనుండి అతిరథమహారధులు హాజరు
Varun Tej 14th film titled Matka

వరుణ్ తేజ్ 14వ సినిమా #VT14 ఈరోజు అట్టహాసంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాకి 'పలాస' #Palasa సినిమాకి దర్శకత్వం చేసి మంచి పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ (KarunaKumar) దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల (Mohan Cherukuri and Dr Vijender Reddy Teegala) ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకి 'మట్కా' #Matka అనే టైటిల్ కూడా కంఫర్మ్ చేశారు చిత్ర నిర్వాహకులు.

varuntejnewfilm.jpg

ఈ సినిమా కథ ఒక పీరియడ్ డ్రామాగా ఉంటుందని ముందే చెప్పారు. విశాఖపట్నం (Visakhapatnam) నేపథ్యంలో సాగే కథ ఇది అని అందుకని, విశాఖపట్నంలో కూడా షూటింగ్ జరపబోతున్నట్టుగా కూడా తెలిసింది. ఈరోజు జరిగిన ముహూర్త సన్నివేశానికి పరిశ్రమకి చెందిన అతిరథ మహారధులు అందరూ విచ్చేసి ఈ సినిమా నిర్మాతలకి, కథానాయకుడికి, అలాగే దర్శకుడికి తమ శుభాకాంక్షురాలు చెప్పారు.

varuntejnewfilm1.jpg

టాప్ నిర్మాత అల్లు అరవింద్ (AlluAravind), నిర్మాత దిల్ రాజు (DilRaju), అలాగే దర్శకులు హరీష్ శంకర్ (HarishShankar), మారుతీ (Maruthi), ఈమధ్యనే 'బేబీ' #Baby అనే చిన్న సినిమాతో చాలా పెద్ద విజయం నమోదు చేసుకున్న ఆ సినిమా నిర్మాత SKN, ఇంకో అగ్ర నిర్మాత సురేష్ బాబు (SureshBabu) ఈ పూజ కార్యక్రమానికి విచ్చేసి కొత్త సినిమా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల (NiharikaKonidela) కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంది.

varuntejnewfilm2.jpg

ఈ సినిమాలో కథానాయకురాలిగా మీనాక్షి చౌదరి (MeenkashiChaudhary) నటిస్తోంది. ఆమె కూడా ఈ పూజా కార్యక్రమానికి హాజరయింది. అలాగే ఇందులో బాలీవుడ్ నటి నోరా ఫతేహి (NoraFatehi) ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టుగా చిత్ర నిర్వాహకులు నిన్న అధికారికంగా ప్రకటించారు.

varuntejnewfilm4.jpg

Updated Date - 2023-07-27T13:02:18+05:30 IST