Saripodhaa Sanivaaram: క్లైమాక్స్.. అల్యూమినియం ఫ్యాక్టరీలో!

ABN , Publish Date - May 14 , 2024 | 06:07 PM

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’లో.. సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్ అడ్వంచర్‌ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ను జరుపుకుంటోంది.

Saripodhaa Sanivaaram: క్లైమాక్స్.. అల్యూమినియం ఫ్యాక్టరీలో!
Natural Star Nani In Saripodhaa Sanivaaram

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)లో.. సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్నారు. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్ అడ్వంచర్‌ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) బ్యానర్‌పై డివివి దానయ్య (DVV Danaiah), కళ్యాణ్ దాసరి (Kalyan Dasari) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పవర్‌ఫుల్ అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

*Allu Arjun: నాగబాబు పోస్టు అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిందా?

ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్ సెట్‌ను నిర్మించినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ మొదలైనట్లుగా తెలుపుతూ.. ఓ పిక్‌ని వదిలారు. ఇందులో నాని పవర్‌ఫుల్‌గా, యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలో కనిపించనున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. (Saripodhaa Sanivaaram Update)


Nani.jpg

మురళి జి డివోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 29 ఆగస్ట్, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 14 , 2024 | 06:07 PM