మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Saripodhaa Sanivaaram: పిడికిలి బిగించి.. బిగ్గెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు!

ABN , Publish Date - Mar 02 , 2024 | 08:09 PM

నాని(nani), టాలెంటెడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్ లో రాబోతున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్‌  పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్‌-ప్యాక్డ్‌ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు.

Saripodhaa Sanivaaram: పిడికిలి బిగించి.. బిగ్గెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు!


నాని(nani), టాలెంటెడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్ లో రాబోతున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్‌  పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్‌-ప్యాక్డ్‌ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మేకర్స్‌ బిగ్గెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చారు.

‘సరిపోదా శనివారం’ ఆగస్ట్‌ 29న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు. హీరో నాని పిడికిలి బిగించి మరో చెత్తో రౌడీని పట్టుకున్న లుక్‌ను విడుదల చేసి రిలీజ్‌ డేట్‌ను వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ  భాషల్లో విడుదల కానుంది. థియేటర్లో మాస్ ట్రీట్ కి ప్రిపేర్ అయిపోండి అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. 

Updated Date - Mar 02 , 2024 | 08:12 PM