Saripodhaa Sanivaaram: శనివారం వరకు ఎందుకుని.. మంగళవారమే క్లాప్ కొట్టేశారు

ABN , First Publish Date - 2023-10-24T20:23:03+05:30 IST

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతోంది. మొదటి సినిమా ‘అంటే సుందరానికీ’ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ అయితే, రెండో సినిమా ‘సరిపోదా శనివారం’ యూనిక్ యాక్షనర్. మంగళవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

Saripodhaa Sanivaaram: శనివారం వరకు ఎందుకుని.. మంగళవారమే క్లాప్ కొట్టేశారు
Saripodhaa Sanivaaram Movie Launch

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘అంటే సుందరానికీ’ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ అయితే, రెండో సినిమా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) యూనిక్ యాక్షనర్. ఈ సినిమా టైటిల్ కాన్సెప్ట్ వీడియోని అన్‌చెయిన్డ్ (Unchained) పేరుతో సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. పూర్తి మాస్, యాక్షన్ అవతార్‌లో నానిని ప్రజెంట్ చేసిన ఈ అన్‌చెయిన్డ్ వీడియో మాస్‌ను ఉత్సాహపరిచింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌పై డివివి దానయ్య (DVV Daanayya), కళ్యాణ్ దాసరి (Kalyan Dasari) భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

SS-1.jpg

‘సరిపోదా శనివారం’ మూవీ దసరా సందర్భంగా మంగళవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాత డివివి దానయ్య దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం సన్నివేశానికి దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, వివి వినాయక్ క్లాప్‌ ఇచ్చారు. తొలి షాట్‌కి ఎస్‌జె సూర్య గౌరవ దర్శకత్వం వహించారు. నాని ఈ మధ్య డిఫరెంట్స్ జోనర్స్‌ని ట్రై చేస్తున్న విషయం తెలియంది కాదు. కథ, పాత్ర డిమాండ్ మేరకు మేకోవర్ అవుతున్నారు. ‘సరిపోదా శనివారం’లో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. (Nani Saripodhaa Sanivaaram Movie Launched)


SS-2.jpg

ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) కథానాయికగా నటిస్తుండగా, తమిళ స్టార్ నటుడు ఎస్.జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించనుండగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Devil: ‘డెవిల్’ స్టన్నింగ్‌ పోస్టర్‌.. సీక్రెట్‌ ఏజెంట్‌ ఏం ఉన్నాడులే..

**********************************************

*Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సక్సెస్‌పై బాలకృష్ణ ఏమన్నారంటే..

*********************************************

*Saripodhaa Sanivaaram: వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా.. ఆపగలరా?

********************************************

Updated Date - 2023-10-24T20:23:03+05:30 IST