Saripodhaa Sanivaaram: వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా.. ఆపగలరా?

ABN , First Publish Date - 2023-10-23T22:23:30+05:30 IST

‘దసరా’తో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించి, ‘హాయ్ నాన్న’ విడుదలకు సిద్ధమౌతున్న నేచురల్ స్టార్ నాని.. ‘అంటే సుందరానికీ’ వంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో మరోసారి జతకడుతున్నారు. వివి ఎంటర్‌టైన్‌మెంట్ డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ కాన్వాస్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అని టైటిల్ ఖరారు చేస్తూ.. టైటిల్ కాన్సెఫ్ట్ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు.

Saripodhaa Sanivaaram: వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా.. ఆపగలరా?
Nani in Saripodhaa Sanivaaram

‘దసరా’ (Dasara)తో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించి, ‘హాయ్ నాన్న’ (Hi Nanna) విడుదలకు సిద్ధమౌతున్న నేచురల్ స్టార్ నాని.. ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) వంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya)తో మరోసారి జతకడుతున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నిర్మించిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ కాన్వాస్‌పై నాని Nani31 చిత్రాన్ని నిర్మించనున్నారు. రీసెంట్‌గా ఒక చిన్న వీడియోతో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్.. టైటిల్‌ను అన్‌చెయిన్డ్ అనే మరో ఆసక్తికరమైన వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. (Unchained Video)

ఈ యాక్షన్-ప్యాక్డ్ అన్‌చైన్డ్ వీడియోలో... ప్రతి వారంలో ఒక రోజు అదుపు చేయలేని కథానాయకుడి అరుదైన, అసాధారణమైన క్యాలిటీని వివరిస్తూ సాయి కుమార్ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమవుతుంది. ఆ విశేషమైన ఒక్క రోజు( శనివారం).. ‘సరిపోదా శనివారం’ అంటూ టైటిల్‌ని రివీల్ చేశారు. ఇది అసాధారణంగా, పవర్ ఫుల్‌గా వుంది. వివేక్ ఆత్రేయ పూర్తిగా ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ని ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అన్‌చెయిన్డ్ హామీ ఇచ్చినట్లుగా ఈ చిత్రం నానిని మునుపెన్నడూ లేని డైనమిక్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తోంది. నాని పాత్రకు ఇచ్చిన హీరోయిక్ ఇంట్రడక్షన్ అదిరింది. అతను విజేతగా బయటకు వచ్చినప్పుడు ప్రజల ముఖాల్లో చిరునవ్వు ఉండే ముగింపు ఎపిసోడ్ పాత్రకు తగిన ఎలివేషన్‌ని తెస్తుంది. (Nani31 UnChained Video)


Nani.jpg

డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎటెంప్ట్ చేస్తూ, క్యారెక్టర్‌ల అవసరానికి తగ్గట్టుగా మేకోవర్స్ చేసుకుంటున్న నాని రగ్గడ్ లుక్‌తో ఇందులో సర్‌ప్రైజ్ చేశారు. ఈ సెన్సేషనల్ కాంబో టైటిల్ గ్లింప్స్.. సినిమాపై మంచి ఇంపాక్ట్‌ని కలగజేస్తోంది. కెమెరా బ్లాక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ దేనికదే సాటి అన్నట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, తమిళ స్టార్ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మంగళవారం ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. (Saripodhaa Sanivaaram Title Concept Video)


ఇవి కూడా చదవండి:

============================

*Game Changer: హమ్మయ్యా.. ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్

*******************************************

*Dussehra: ఉపాస‌న - రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూశారా?

************************************

*Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ భామకు ఆ తరహా పాత్రలు చేయాలనుందట..

************************************

*Prabhas: శత శతమానం భవతి.. ‘కన్నప్ప’ టీమ్ ‌గ్రాండ్‌గా విషెస్

****************************************

Updated Date - 2023-10-23T22:23:30+05:30 IST