Nabha Natesh: పాత ఫోటోలనే మళ్ళీ పోస్టు చేస్తూ, చాప్లిన్ కి నివాళులు ఇచ్చిన నభ నటేష్

ABN , Publish Date - May 06 , 2024 | 04:36 PM

నటి నభ నటేష్ లెజెండరీ కమెడియన్, ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ నటుడు చార్లీ చాప్లిన్ కి నివాళులు అర్పించింది. ఆమె చాప్లిన్ వేషంలో తీసిన పాత ఫోటోలని మళ్ళీ పోస్టు చేస్తూ చాప్లిన్ లాంటి నటుడు ఏడిపిస్తూ, నవ్విస్తూ ఎలా చేశారో అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది నభ

Nabha Natesh: పాత ఫోటోలనే మళ్ళీ పోస్టు చేస్తూ, చాప్లిన్ కి నివాళులు ఇచ్చిన నభ నటేష్
Nabha Natesh

చార్లీ చాప్లిన్ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక అపూర్వ నటుడు. మాటలు లేకుండా కేవలం మూకీ సినిమాలతో తనదైన శైలితో ప్రేక్షకులని, నవ్వించాడు, ఏడిపించాడు. ప్రపంచ నటుల్లో చార్లీ చాప్లిన్ ఒక విశిష్ట నటుడు, వైవిధ్య నటుడు. లెజెండరీ కమెడియన్ నటుడిగా ప్రపంచం అంతా చార్లీ చాప్లిన్ కి అభిమానులు వున్నారు. అటువంటి చార్లీ చాప్లిన్ కి తనదైన శైలిలో నివాళులు అర్పించింది తెలుగు నటి నభ నటేష్. ఈమధ్యనే ప్రియదర్శి సరసన ఒక సినిమా చేస్తున్న నభ నటేష్ తను చార్లీ చాప్లిన్ వేషంలో వున్న ఫోటోలని తన సామాజిక మాధ్యమంలో పెట్టింది. (Nabha Natesh tributes to legendary comedian Charlie Chaplin)

nabhanateshchaplinone.jpg

ఈ ఫోటోలని పోస్టు చేస్తూ నభ నటేష్ పెద్ద వ్యాసమే రాసింది అని చెప్పాలి. చార్లీ చాప్లిన్ కి నివాళులు అర్పిస్తూ, చాప్లిన్ నటుడిగా ప్రేక్షకులని నవ్వించారు, ఏడిపించారు అని చెపుతూ అతను అలా ఏ విధంగా చేశారో అని ఎప్పుడూ ఆశ్చర్యపోతూ వుంటాను అని చెప్పింది నభ. అలాంటి చాప్లిన్ కి నేను నివాళులు అర్పిస్తున్నాను అంటూ చాప్లిన్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది నభ. (Nabha Natesh paid tribute to Charlie Chaplin in a different way with dressed up like Charlie Chaplin) ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా నభ ప్రపంచంలో అత్యుత్తమ కమెడియన్ అయిన చార్లీ చాప్లిన్ తలుచుకుంటూ అంతకంటే గొప్ప నటుడు ఎవరుంటారు అనే రీతిలో ఈ ఫోటోలని పోస్ట్ చేసింది. అదే ఫోటోలను ప్రతి సంవత్సరం నభ తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నట్టుగా కనపడుతోంది.

nabhanateshchaplintwo.jpg

నభ నటేష్ 'స్వయంభు' సినిమాలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్ ఇందులో కథానాయకుడు, ఇది ఒక పీరియడ్ డ్రామా, ఈ సినిమా నుండి నభ మొదటి చిత్రాన్ని కొన్ని రోజుల క్రితం విడుదల చేసినప్పుడు మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రియదర్శి సరసన 'డార్లింగ్' అనే సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ సినిమాని 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండటం ఆసక్తికరం.

Updated Date - May 06 , 2024 | 04:37 PM