Naba Natesh: డార్లింగ్.. డార్లింగ్ ‘నభా’ ప్రభాస్‌ను దించేసిందిగా!

ABN , Publish Date - Apr 17 , 2024 | 08:04 PM

ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేష్ తాజాగా ప్ర‌భాస్ డైలాగ్స్‌తో చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

Naba Natesh: డార్లింగ్.. డార్లింగ్ ‘నభా’ ప్రభాస్‌ను దించేసిందిగా!
naba

న‌భా న‌టేష్ (Nabha Natesh).. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. అందం, అభిన‌యం పుష్క‌లంగా ఉన్న‌ ఈ న‌టికి గ‌త కొంతకాలంగా చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఈ చిన్న‌ది చివ‌ర‌గా నితిన్ మ్యాస్ట్రో సినిమాలో క‌నిపించ‌గా తాజాగా నిఖిల్ స్వ‌యంభు (Swayambhu) చిత్రంలో న‌టిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌భాస్ న‌టించిన సినిమాల్లో ఆయ‌న వాడిన త‌న ఊత ప‌దం డార్లింగ్ అనే డైలాగ్స్‌ను త‌ను చెబుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ర‌చ్చ చేస్తుండ‌గా చాలా మంది రీ ట్వీట్లు చేస్తున్నారు.

nabaa.JPG

అప్పుడెప్పుడో 2015లో శివ‌రాజ్ కుమార్ న‌టించిన వ‌జ్ర‌కాయ అనే క‌న్న‌డ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుంద‌రి న‌భా న‌టేష్ (Nabha Natesh) తెలుగులో సుధీర్‌బాబు న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో ఆరంగేట్రం చేసింది. ఇక ఆ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవ‌డ‌మే కాక రెండు తెలుగు రాష్ట్రాల‌లో మంచి ఫ్యాన్ బేస్‌ను సాధించుకుంది. తెలుగు ఇండ‌స్ట్రీకే ప‌రిమిత‌మై ఇక్క‌డ మాత్ర‌మే చిత్రాలు చేస్తోంది. ఈ మ‌ధ్య సినిమాల ప‌రంగా గ్యాప్ వ‌చ్చిన‌ప్ప‌టికీ వ‌రుస ఫొటో షూట్ల‌తో యువ‌కుల్లో కాక రేపుతుంది.

natesh.JPG


అయితే తాజాగా ప్ర‌భాస్ డైలాగ్స్‌తో చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవడంతో న‌భా న‌టేష్ (Nabha Natesh) టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక ప్ర‌భాస్ అభిమానులైతే ఓ రీతిలో న‌భాపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తూ ఆమె పోస్టును రీ ట్వీట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియోను చూస్తుంటే మున్ముందు ప్ర‌తి హీరో అభిమానులు ఇలాంటి వీడియోలతో పెద్ద ర‌చ్చే చేసేలా అనిపిస్తోండ‌గా రోజూ చాలా వీడియోలు అవ‌కాశ‌మున్న‌ట్లు క‌నిపిస్తోంది.

1.JPG

Updated Date - Apr 17 , 2024 | 09:40 PM