Swayambhu: ‘స్వయంభూ’ కోసం సవ్యసాచిలా నిఖిల్

ABN , First Publish Date - 2023-11-05T15:15:27+05:30 IST

హీరో నిఖిల్ నటిస్తోన్న 20వ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం వియత్నాంలో దాదాపు ఒక నెల రోజులు కఠోర శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్. ట్రైనింగ్ సెషన్ పూర్తయిన వెంటనే, నిఖిల్ కత్తి యుద్ధం మొదలైనవాటిలో ప్రోగా మారడానికి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. కఠినమైన ప్రాక్టీస్ సెషన్ నిఖిల్‌ను సవ్యసాచిగా చేసిందనే విషయం తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో చెబుతోంది.

Swayambhu: ‘స్వయంభూ’ కోసం సవ్యసాచిలా నిఖిల్
Nikhil

హీరో నిఖిల్ (Nikhil) నటిస్తోన్న 20వ చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం వియత్నాంలో దాదాపు ఒక నెల రోజులు కఠోర శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌ (Pixel Studios)కు చెందిన భువన్, శ్రీకర్ (Bhuvan and Sreekar) నిర్మిస్తున్న ఈ ఎపిక్ ఒడిస్సీలో లెజెండరీ యోధుని పాత్రను పోషించడానికి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు నిఖిల్. నమ్మశక్యం కాని యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రంలో నిఖిల్ కొన్ని అద్భుతమైన స్టంట్స్ చేయనున్నారు. వియత్నాంలో చేస్తున్న శిక్షణకు సంబంధించి నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

ట్రైనింగ్ సెషన్ పూర్తయిన వెంటనే, నిఖిల్ కత్తి యుద్ధం మొదలైనవాటిలో ప్రోగా మారడానికి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. కఠినమైన ప్రాక్టీస్ సెషన్ నిఖిల్‌ను సవ్యసాచిగా చేసింది. ఇప్పుడు రెండు చేతులతో కత్తియుద్ధం చేయగలుగుతున్నట్లుగా తాజాగా నిఖిల్ షేర్ చేసిన వీడియో తెలియజేస్తుంది. కత్తి యుద్ధంలో అతని నైపుణ్యాన్ని చూపుతుంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకెళ్తున్న సంయుక్తా మీనన్ (Samyuktha Menon) ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.


‘స్వయంభూ’ (Swayambhu Movie) నిఖిల్ 20వ సినిమా. ఆయన కెరీర్‌లోనే హై బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. అలాగే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Venki Mahesh: పక్కపక్కనే పెద్దోడు, చిన్నోడు.. సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పిక్

*************************************

*Srinidhi Shetty: నా అభిమాన నటుడ్ని దగ్గరగా చూసి.. నోట మాట రాలేదు

************************************

*Actress: విద్యార్థులపై చేయి చేసుకున్న సినీ నటి అరెస్ట్.. విషయం ఏమిటంటే?

************************************

*Natti Kumar: వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క కాల్ రాలేదు.. చంద్రబాబు, పవన్‌లకు మద్దతు ఇవ్వగానే..?

**********************************

Updated Date - 2023-11-05T15:15:28+05:30 IST