Darling: ప్రియదర్శి, నభా నటేష్ సినిమా ప్రచార డ్రామా

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:36 PM

గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ప్రియదర్శి, నభా నటేష్ ఇద్దరూ ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు తమ రాబోయే సినిమా 'డార్లింగ్' కోసమని ఈరోజు ప్రకటించారు. 'హనుమాన్' సినిమా తరువాత ఆ నిర్మాత ఇప్పుడు ఈ ఇద్దరితో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Darling: ప్రియదర్శి, నభా నటేష్ సినిమా ప్రచార డ్రామా
Priyadarshi and Nabha Natesh is playing lead in Darling

జనవరిలో సంక్రాంతి పండగ నాడు విడుదలైన 'హనుమాన్' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ సినిమా నిర్మించిన నిరంజన్ రెడ్డి, తన ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ సంస్థ నుండి ఇప్పుడు తదుపరి సినిమా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటించే విషయాన్నీ వైవిధ్యంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా సామజిక మాధ్యమాల్లో జరుగుతున్న అల్లరి అంతా కేవలం ఈ సినిమా ప్రచారానికి వాడుకున్నారని అర్థం అవుతోంది. అదే విషయాన్నీ నిర్మాత చెప్పారు.

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నిరంజన్ రెడ్డి 'డార్లింగ్' అనే సినిమా ప్రకటించారు, దీనికి వై దిస్ కొలవరి? అని టాగ్ లైన్ కూడా పెట్టారు. కేవలం ఈ సినిమా ప్రచారాల్లో భాగంగా నభా నటేష్, ప్రియదర్శి ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు సామాజిక మాధ్యమాల్లో చేసుకున్నట్టుగా చెప్పారు.

priyadarshinabha.jpg

ఇప్పుడు ఈ 'డార్లింగ్' సినిమా టీజర్ విడుదల చేశారు. దీనికి అశ్విన్ రామ్ దర్శకుడు, వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఇంకా ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ ఇంకా చాలామంది నటీనటులు వున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఇందులో భార్య భర్తల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తోంది.

అందుకనే ఈ సినిమా అధికారికంగా ప్రకటించడానికి కూడా ప్రియదర్శి, నభా నటేష్ డయాస్ పై జగడం తో మొదలెట్టారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ సినిమా గురించి ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే కొన్నిరోజులుగా ఇద్దరూ ఒకరిపై ఒకరు సామాజిక మాధ్యమాల్లో చేసుకున్న విమర్శలు కూడా ఈ సినిమా ప్రచారంలో భాగం అని చెప్పారు.

Updated Date - Apr 20 , 2024 | 01:36 PM