Mirai: తేజ సజ్జా సూపర్ యోధ చిత్ర టైటిల్ ఇదే..

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:02 PM

‘హనుమాన్’ చిత్రంలో సూపర్ హీరోగా కనిపించిన యంగ్ హీరో తేజ సజ్జా.. మరోసారి అదే తరహా పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా రీసెంట్‌గా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ యోధగా తేజ సజ్జా కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘మిరాయ్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు.

Mirai: తేజ సజ్జా సూపర్ యోధ చిత్ర టైటిల్ ఇదే..
Teja Sajja in Mirai Movie

‘హనుమాన్’ (HanuMan) చిత్రంలో సూపర్ హీరో (Super Hero)గా కనిపించిన యంగ్ హీరో తేజ సజ్జా (Young Hero Teja Sajja).. మరోసారి అదే తరహా పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై కార్తీక్ ఘట్టంనేని (Karthik Gattamneni) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా రీసెంట్‌గా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ యోధ (Super Yodha)గా తేజ సజ్జా కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి మేకర్స్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 36‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి ‘మిరాయ్’ (Mirai) అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

*Veera Dheera Sooran: ‘వీర ధీర శూరన్’గా.. చియాన్ విక్ర‌మ్


‘మిరాయ్’ అంటే అర్థం ‘మిరాకిల్’ (Miracle) అని మేకర్స్ చెబుతున్నారు. టైటిల్‌తో పాటు టైటిల్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌ని కూడా మేకర్స్ గురువారం అధికారికంగా విడుదల చేశారు. ఈ టైటిల్ లుక్ పోస్టర్‌లో సూపర్ హీరో తేజ సజ్జా నిజంగానే ఓ సూపర్ యోధుడిగా కనిపిస్తున్నాడు. హనుమాన్ చిత్రంలో సాంప్రదాయ దుస్తులలో కనిపించిన తేజ, ఇందులో మాత్రం స్టైలిష్ మేకోవర్‌తో కనిపించాడు. ఈ పవర్ ఫుల్ స్టిల్ చూస్తుంటే.. సినిమా కూడా అంతే పవర్ ఫుల్‌గా ఉండబోతుందనేది అర్థమవుతోంది. తేజ కెరీర్‌లో మరో గొప్ప చిత్రం రాబోతుందనేది ఈ పోస్టర్‌తోనే తెలిసిపోతోంది.


Mirai-Movie.jpg

‘ఈగల్’ తర్వాత కార్తీక్ ఘట్టంనేని మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు ఇది వరుసగా రెండవ ప్రాజెక్ట్. కార్తీక్ ఘట్టంనేని, తేజ సజ్జను భారీ క్యారెక్టర్లో ప్రెజెంట్ చేస్తూ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీని రెడీ చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఇది సూపర్ యోధా యొక్క సాహసోపేతమైన కథ. హను-మాన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, సూపర్ హీరో తేజ సజ్జా నుండి రాబోతోన్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా, గ్రాండ్ స్కేల్‌లో నిర్మించనున్నారు. (Mirai Movie Title Announcement)

Updated Date - Apr 18 , 2024 | 12:22 PM