Teja Sajja: మహేశ్ బాబుని ‘మగేశ్’ అనేవాడిని.. అప్పుడాయన ఏమనేవారంటే..

ABN , Publish Date - Feb 04 , 2024 | 09:21 AM

ఈ సంక్రాంతికి స్టార్స్‌ మధ్య యువహీరో తేజా సజ్జా ‘హను-మాన్‌’గా దూసుకొచ్చాడు. బాక్సాఫీస్‌ దగ్గర నిలిచి గెలిచాడు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, వెంకటేష్‌ వంటి స్టార్స్‌ సినిమాల్లో బాలనటుడిగా మెరిసి... ‘జాంబిరెడ్డి’తో హీరోగా మారాడు. ‘హను-మాన్‌’ సక్సెస్‌ సందర్భంగా ఈ యంగ్‌ హీరో మీడియాతో స్పెషల్‌గా మాట్లాడారు. ఇందులో మహేష్, తారక్‌ల గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

Teja Sajja: మహేశ్ బాబుని ‘మగేశ్’ అనేవాడిని.. అప్పుడాయన ఏమనేవారంటే..
Teja Sajja and Jr NTR

ఈ సంక్రాంతికి స్టార్స్‌ మధ్య యువహీరో తేజా సజ్జా ‘హను-మాన్‌’గా దూసుకొచ్చాడు. బాక్సాఫీస్‌ దగ్గర నిలిచి గెలిచాడు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, వెంకటేష్‌ వంటి స్టార్స్‌ సినిమాల్లో బాలనటుడిగా మెరిసి... ‘జాంబిరెడ్డి’తో హీరోగా మారాడు. ‘హను-మాన్‌’ సక్సెస్‌ సందర్భంగా ఈ యంగ్‌ హీరో చెబుతున్న ముచ్చట్లివే...

Teja-Sajja.jpg

బొమ్మలు కొనడానికి వెళితే...

బాలనటుడిగా యాభైకి పైగా సినిమాల్లో నటించా. మొదటి అవకాశం వచ్చినప్పుడు నాకు రెండున్నరేళ్లు అనుకుంటా. మా కజిన్‌ నాకు బొమ్మలు కొనడానికి బయటికి తీసుకెళ్లాడు. అప్పటికే దర్శకుడు గుణశేఖర్‌ ‘చూడాలని వుంది!’ కోసం ఓ పిల్లాడిని వెతుకుతున్నారట. అక్కడ నన్ను చూసిన ఆయన వెంటనే ఎంపిక చేశారు. అలా ఊహ తెలిసేసరికే నటుడినయ్యా. ఆ తరువాత వరుసగా ‘రాజకుమారుడు’, ‘కలిసుందాం.. రా!’, ‘యువరాజు’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’.. సినిమాల్లో నటించా. (Teja Sajja Interview)


Teja-sajja-1.jpg

హీరో కావాలనుకునే...

బాలనటుడిగా తెలుగులోనే కాకుండా తమిళ్‌, ఇంగ్లీష్‌లో కూడా నటించా. చిన్నప్పటి నుంచే హీరోకి కావాల్సిన అర్హతలను నేర్చుకుంటూ వచ్చా. కిక్‌ బాక్సింగ్, స్విమ్మింగ్‌, హార్స్‌ రైడింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌.. ఇలా అన్నింటిలోనూ ప్రావీణ్యం ఉంది. అంతేకాదు... ‘ఓ బేబీ’ కోసం గిటార్‌, ‘హను- మాన్‌’ కోసం స్కూబా డైవింగ్‌ కూడా నేర్చుకున్నా. (Hanu-Man Hero Teja Sajja)

కార్నియాకు ప్రమాదం

‘హను-మాన్‌’లోని పోరాట ఘట్టాల్లో కళ్లు రౌద్రంతో కనిపించేందుకు లెన్స్‌ వాడాల్సి వచ్చింది. దాదాపు 90 రోజులు వాడా. లెన్స్‌లోకి దుమ్ము, ధూళి వెళ్లిపోయేవి. అదీగాక నాలుగు బాటిళ్ల గ్లిజరిన్‌ వాడటంతో షూటింగ్‌ పూర్తయిన కొన్ని రోజులకు కుడి కన్ను సరిగ్గా కనిపించలేదు. హాస్పిటల్‌కు వెళ్తే 70 శాతం కార్నియా దెబ్బతిందని డాక్టర్లు చెప్పారు. ‘హను-మాన్‌’ షూటింగ్‌ సమయంలో ఇలాంటి గాయాలెన్నో భరించా.

Teja-Sajja-2.jpg

ఐదేళ్ల కష్టం

‘వీడికేంటి మొదటి నుంచి సినిమాల్లోనే ఉన్నాడు... సులువుగా హీరో అయిపోయాడు’ అనుకుంటారు చాలామంది. నిజానికి అందరిలాగే నేనూ ఆడిషన్స్‌ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగా. దాదాపు ఐదేళ్ల పాటు అవకాశాల కోసం విశ్వప్రయత్నాలు చేశా. కొందరు మొదట నన్ను ఎంపిక చేసి ఆ తర్వాత వేరే వాళ్లను తీసుకునేవారు. కొన్ని సినిమాలేమో పట్టాలెక్కకముందే అటకెక్కేవి. మరికొన్ని సినిమాలు షూటింగ్‌ మధ్యలో ఆగిపోయేవి. చాలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. చివరికి ‘ఓ బేబీ’లో సహనటుడిగా రీ ఎంట్రీ ఇచ్చా.


Mahesh.jpg

‘మగేశ్‌’ అని పిలిచేవాడిని...

‘రాజకుమారుడు’ షూటింగ్‌ సమయంలో నాకు నోరు సరిగ్గా తిరగక మహేశ్ బాబు (Mahesh Babu) ను ‘మగేశ్‌ అన్నా... మగేశ్‌ అన్నా’ అని పిలిచేవాడిని. దాంతో ఆయన ‘నా పేరును ఖూనీ చెయ్యొద్దురా బాబు.. కావాలంటే అన్నా అని పిలిస్తే చాలు’ అన్నారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తే. అలాగే అప్పట్లో తారక్‌ (Tarak) నన్ను క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకోమని సలహా ఇచ్చారు. నాలుగేళ్లు కష్టపడి నేర్చుకున్నా. ఆ తర్వాత ఐదేళ్లు శ్రమించి పాశ్చాత్య నృత్యంలోనూ పట్టు సాధించా.

ఫటాఫట్‌

  • ఫాంటసీ సినిమాలలో నటించడమంటే చాలా ఇష్టం.

  • చికెన్‌ శాండ్విచ్‌ రోజూ తినమన్నా తింటా. అంత పిచ్చి అదంటే...

  • బాలనటుడిగా యువరాజు, ఇంద్ర, బాచి సినిమాలు బాగా నచ్చుతాయి.

  • దర్శకుల్లో పూరీ జగన్నాథ్‌, వి.వి వినాయక్‌ ఇష్టం.

  • స్విట్జర్లాండ్‌, వైజాగ్‌ నాకిష్టమైన ప్రదేశాలు.

  • ఖాళీ సమయం దొరికితే గంటల తరబడి సినిమాలు చూస్తూ గడిపేస్తా.


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: పద్మవిభూషణుడికి ఉపాసన అభినందన సభ.. హాజరైన తెలంగాణ సీఎం

*****************************

*Love Guru: శోభనం రోజు.. భర్త ఎదురుగానే భార్య ఏం చేస్తుందో చూశారా!

**************************

*Natti Kumar: గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదా?

**********************

*Operation Valentine: వరుణ్ తేజ్ సినిమా విడుదల తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

**************************

*Natti Kumar: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం

**************************

Updated Date - Feb 04 , 2024 | 09:39 AM