Teja Sajja: ‘హను-మాన్’ విడుదల తర్వాత మెగాస్టార్ ఏమని మెసేజ్ చేశారంటే..

ABN , Publish Date - Jan 14 , 2024 | 06:18 PM

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం భారీ సక్సెస్ దిశగా దూసుకెళుతుండటంతో.. హీరో తేజ సజ్జా మీడియాకు తన సంతోషాన్ని తెలియజేశారు.

Teja Sajja: ‘హను-మాన్’ విడుదల తర్వాత మెగాస్టార్ ఏమని మెసేజ్ చేశారంటే..
Hero Teja Sajja and Chiranjeevi

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ (Hanu-Man). యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ఈ సినిమాని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ.. ఎపిక్ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో హీరో తేజ సజ్జా మీడియాకు తన ఆనందాన్ని తెలియజేశారు.

‘హను-మాన్’ ఇంత గొప్ప విజయాన్ని అందుకోవడం ఎలా అనిపిస్తోంది?

చాలా ఆనందంగా వుంది. విడుదలైన అన్నిచోట్ల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులంతా చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. ఇతర భాషల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంది. నేను ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం వుంది. కానీ ఇతర భాషల వారికి నేనెవరో కూడా తెలీదు. అలాంటి వారి నుండి వస్తున్న గొప్ప స్పందన చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇంత ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్, నెంబర్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. హనుమాన్ నా కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ విజయం ప్రేక్షకులందరిది. అందరూ గొప్పగా ఆదరించారు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారనేదానికి ‘హను-మాన్’ నిదర్శనం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఏదో ఒక దైవశక్తి మమ్మల్ని నడుపుతుందని బలంగా నమ్ముతున్నాను. (Teja Sajja Happy with Hanu-Man Success)


Teja-Sajja.jpg

‘హను-మాన్’ విడుదలకు ముందు కాస్త ఒత్తిడి వాతావరణం కనిపించింది కదా? అప్పుడు మీ ఆలోచన ఎలా ఉండేది?

చివరి పది రోజులుగా అసలు ఒత్తిడి తీసుకోలేదు. ప్రతిది అనుకున్నట్లుగా జరుగుతుందని నమ్మకం పెట్టుకున్నాం. ఇప్పుడు థియేటర్స్ ప్రతి ఆటకి పెరుగుతున్నాయి. ఇది తప్పకుండా నాలుగు వారాలకు పైగా రన్ వుండే చిత్రమని ముందే బలంగా నమ్మాం. ఈ వారం చూడని వారు మరో వారం ఖచ్చితంగా చూస్తారని భావించాం.

నిర్మాత కె నిరంజన్ రెడ్డి గురించి?

మా నిర్మాత నిరంజన్ రెడ్డి మాపై చాలా నమ్మకం ఉంచారు. దర్శకుడు, నిర్మాత నమ్మకం చూసి నేను మరో చిత్రం కమిట్ అవ్వలేదు. ఈ మధ్యలో ఏదైనా చిత్రం చేస్తే దాని ప్రభావం ఎంతో కొంత ‘హను-మాన్’పై పడే అవకాశం వుంది. అలాంటి అవకాశం లేకుండా బలంగా నమ్మి ఈ సినిమా చేశాను. ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్స్ చూశాను. వారి అద్భుతమైన స్పందన చూసి నా బరువంతా దిగిపోయినట్లు అనిపించింది. విజయాన్ని ఆస్వాదిస్తూనే సినిమాని ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్‌కు చేరువ చేయడానికి గురించి ఆలోచిస్తున్నాం. బెంగళూరు, చెన్నై, ముంబై వెళ్తున్నాం. యూఎస్ వెళ్ళే ఆలోచన కూడా వుంది. (Young Hero Teja Sajja)

షూటింగ్ సమయంలో మీరు మంచి ఇన్ పుట్స్ ఇచ్చారని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు?

ఒక నటుడిగా లొకేషన్‌లో నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే మొహమాటం లేకుండా చెబుతాను. నాకు అనిపించిందంటే ప్రేక్షకుడికి కూడా అనిపించే అవకాశం వుంది కదా. దర్శకుడు ప్రశాంత్ వర్మ‌గారు ఇన్ పుట్ ఎవరు చెప్పినా వింటారు. అది ఆయన గొప్పతనం. అంతిమంగా సినిమా అద్భుతంగా రావడమే అందరి లక్ష్యం. హనుమాన్‌కి అందరం ఒక టీం వర్క్‌గా పని చేశాం.

‘హను-మాన్’ యాక్షన్ స్టంట్స్ అన్నీ ఒరిజినల్‌గా చేశారా?

అన్నీ ఒరిజినల్‌గా చేసినవే. అండర్ వాటర్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో గాల్లో వుండే సీక్వెన్స్ ఇవన్నీ రియల్‌గా చేశాం. ఎయిర్ సీక్వెన్స్‌లో పొద్దున్న మేకప్ వేసుకుని రోప్ ఎక్కితే మళ్ళీ సాయంత్రానికి దిగేవాడిని.

‘హను-మాన్’లో బ్రదర్ సిస్టర్ ఎమోషన్ బాగా పండింది? వరలక్ష్మీ శరత్ కుమార్‌తో పని చేయడం ఎలా అనిపించింది?

వరలక్ష్మీ శరత్ కుమార్‌గారు గ్రేట్ యాక్టర్. పెద్ద యాక్టర్‌తో వర్క్ చేస్తున్నపుడు నేర్చుకునే అవకాశం వుంటుంది. పరస్పర సహకారంతోనే సన్నివేశాలన్నీ చక్కగా వచ్చాయి.

ఇందులో హనుమాన్ విగ్రహం చూసినప్పుడల్లా చాలా దివ్యమైన అనుభూతి కలిగింది.. అది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?

ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలలు పట్టింది.

హనుమాన్‌గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కనిపిస్తారేమో అని చాలా మంది భావించారు? మీరు సంప్రదించారా?

చిరంజీవిగారికి ‘హను-మాన్’ ప్రాజెక్ట్ గురించి తెలుసు. మా ఉద్దేశం కూడా చిరంజీవిగారికి తెలుసు(నవ్వుతూ). ‘హను-మాన్’ విషయంలో చిరంజీవిగారు చాలా ఆనందంగా వున్నారు. 12 తేదీన ‘కంగ్రాట్స్ మై బాయ్. సో ప్రౌడ్ ఆఫ్ యు’ అని అభినందనలు తెలుపుతూ నాకు మెసేజ్ పెట్టారు.

Teja-Sajja-2.jpg

హరిగౌర నేపధ్య సంగీతానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది? థియేటర్‌లో చూసినప్పుడు ఏం అనిపించింది?

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్. కొన్ని సీన్స్ చూస్తూ డివైన్ ట్రాన్స్‌లోకి వెళ్తున్నారు ఆడియన్స్. హనుమాన్ సినిమా మేము చేశామని అనుకోవడం లేదు. హను-మాన్ మాకు జరిగింది.

హను-మాన్ జర్నీలో మీరు నేర్చుకున్నది?

ఓపికగా వుండటం నేర్చుకున్నాను. (నవ్వుతూ)

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్?

ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. త్వరలోనే ప్రకటిస్తాం.

Hanuman.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఓటీటీలోకి వచ్చే డేట్ ఫిక్స్

**************************

*Guntur Kaaram: రెండో రోజూ రమణగాడు రాంప్ ఆడేశాడు.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

****************************

*నిర్మాత వివేక్ కూచిభొట్ల‌ను బెదిరిస్తోన్న సినీ రచయితపై కేసు నమోదు

************************

*‘హను-మాన్’కు థియేటర్లు ఇవ్వని వారిపై TFPC సీరియస్

***********************

Updated Date - Jan 14 , 2024 | 06:18 PM