Manchu Lakshmi: సెన్సార్‌ని షేకాడించిన ఫైర్ బ్రాండ్.. ఏం సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా?

ABN , Publish Date - May 22 , 2024 | 02:08 PM

ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో.. అన్వికా ఆర్ట్స్ - ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు - కన్నడ - హిందీ - తమిళ - మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

Manchu Lakshmi: సెన్సార్‌ని షేకాడించిన ఫైర్ బ్రాండ్.. ఏం సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా?
Manchu Lakshmi in Adiparvam

ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి (Fire Brand Manchu Lakshmi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’ (Adiparvam). రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో.. అన్వికా ఆర్ట్స్ - ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు - కన్నడ - హిందీ - తమిళ - మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సెన్సార్ చేసిన సెన్సార్ (Censor) సభ్యులు ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీ అండ్ టీమ్‌పై ప్రశంసలు కురిపించినట్లుగా మేకర్స్ తెలియజేశారు. మరీ ముఖ్యంగా మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నటనకు ఫిదా అయ్యామని, రేపు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతారని సెన్సార్ మెంబర్స్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తో టీమ్ తమ సంతోషాన్ని తెలియజేసింది. ఈ సినిమాకు సెన్సార్ వారు యుబైఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు.

*Rave Party Hema: ఇది ఆమె నిజ స్వరూపం.. హేమపై సహనటి సంచలన వ్యాఖ్యలు


‘ఆదిపర్వం’ ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యదార్థ సంఘటనల నుండి అల్లుకున్న కథ, ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ అని మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసింద. ఈ చిత్రలోని పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి. దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతుండడం విశేషం. (Adiparvam Censor Completed)


Adiparvam.jpg

సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి (Sanjeev Megoti) మాట్లాడుతూ.. బహు భాషల్లో రూపొందిన ‘ఆదిపర్వం’ అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్‌కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - May 22 , 2024 | 02:09 PM