Rave Party Hema: ఇది ఆమె నిజ స్వరూపం.. హేమపై సహనటి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 22 , 2024 | 01:37 PM

ఈ రేవ్ పార్టీకి, తనకు ఎటువంటి సంబంధం లేదని తెలియజెప్పడం కోసం హేమ తెగ ప్రయత్నాలు చేస్తున్నా.. ఆమె ఈ పార్టీలో ఉన్నట్లుగా బెంగళూరు సిటీ కమిషనర్‌ దయానంద్‌ క్లియర్‌గా స్పష్టం చేస్తున్నారు. ఇలా హాట్ టాపిక్ అవుతున్న హేమ వ్యవహారంపై ఆమె సహనటి కరాటే కళ్యాణి తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. హేమ గురించి ఆమె మాట్లాడుతోన్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.

Rave Party Hema: ఇది ఆమె నిజ స్వరూపం.. హేమపై సహనటి సంచలన వ్యాఖ్యలు
Karate Kalyan and Actress Hema

బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు వంటి వాటిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కొందరని అరెస్ట్ కూడా చేసి.. వారి నుంచి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో నటి హేమ (Actress Hema) పేరు మాత్రం వైరల్ అవుతోంది. ఈ రేవ్ పార్టీకి, తనకు ఎటువంటి సంబంధం లేదని తెలియజెప్పడం కోసం హేమ తెగ ప్రయత్నాలు చేస్తున్నా.. ఆమె ఈ పార్టీలో ఉన్నట్లుగా బెంగళూరు సిటీ కమిషనర్‌ దయానంద్‌ (Dayanand) క్లియర్‌గా స్పష్టం చేస్తున్నారు. ఇలా హాట్ టాపిక్ అవుతున్న హేమ వ్యవహారంపై ఆమె సహనటి కరాటే కళ్యాణి (Karate Kalyani) తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. హేమ గురించి ఆమె మాట్లాడుతోన్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో హేమ నిజ స్వరూపం ఇదని చెబుతూనే.. ఈ కేసులో ఆమె బయటపడాలని ఆమె కోరుకుంటుండటం విశేషం.

*Hema: రేవ్ పార్టీ కవరింగ్ కోసం రెసిపీ.. హేమతో ఆడేసుకుంటోన్న నెటిజన్లు

ఈ వీడియోలో (Karate Kalyani Video) ‘‘గురివింద గింజ తన వెనకున్న మచ్చ చూసుకోదు అన్నట్లుగా.. బెంగళూర్ రేవ్ పార్టీలో దొరికిన హేమక్క.. ఇండస్ట్రీలో నేను పెద్దముత్తైదువుని.. ఇండస్ట్రీలోని వారిని నేనే ఉద్దరిస్తున్నాను.. అన్నిటికి నేనే బాధ్యురాలిని, ప్రతి వాటిలో నేనే ఉన్నాను, ఆడవారికి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను, ఇండస్ట్రీ వాళ్లందా నామీదే ఆధారపడ్డారు.. నేను పెద్ద దిక్కుని.. అనేలా ‘మా’ ఎన్నికల సమయంలో, ఇతరత్రా విషయాలలో ఆమె తీరు చూసి.. అమ్మో ఈవిడది పెద్ద నోరు.. మాట్లాడకూడదనేలా.. ఎవరినీ వదలకుండా పిచ్చిపిచ్చిగా ఆమె చేసిన గొడవలన్నింటినీ చూశాం. ‘మా’ ఎన్నికల సమయంలో చేతులు కొరకడం, రాజేంద్రప్రసాద్‌గారిని అడ్డగించడం వంటివి చేసింది. నా మీద కేసులు పెట్టి కొట్టాడింది. నేను ఫ్రెండ్స్‌తో సరదాగా పేకాడుతుంటే, అదెవరో పట్టిస్తే.. నేను ఏదో పెద్ద నేరం చేసినట్లుగా హడావుడి చేసిన హేమక్క.. ఈ రోజు ఏం చేసింది? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో పాటు దొరికావ్. నీ శాంపిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బెంగళూరు పోలీసులు నిన్ను శిక్షిస్తారు. హేమక్క.. మరిన్ని శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు. (Hema- Rave Party)


Hema-Aunty.jpg

ఎందుకంటే, ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఆచితూచి మాట్లాడాలి. కర్మ రిటర్న్స్ అంటాం.. అంటే మనం చేసేందే మనకు తిరిగి వస్తుందీ అని. కాబట్టి.. ఇకముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయవల్ల.. నీకు ఆ డ్రగ్స్‌తో ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలని, శాంపిల్స్‌లో నీ ప్రమేయం ఏమీ లేదనేలా రిపోర్ట్ రావాలని.. నీకోసం మరొక్కసారి ఆ దేవుడిని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకోసారి ఆడవాళ్లపై అదని, ఇదని నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తావని ఆశిస్తున్నాను. హేమక్కా అర్థమైందా ఇప్పటికైనా..’’ అంటూ కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు (Karate Kalyani Comments on Hema) టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి.

Read Latest Cinema News

Updated Date - May 22 , 2024 | 01:37 PM