Manamey: ‘మనమే’ మ్యాజికల్ బ్లాక్‌బస్టర్ సినిమా.. రాసిపెట్టుకోండి

ABN , Publish Date - Jun 01 , 2024 | 10:33 PM

శర్వానంద్, కృతి శెట్టి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మనమే’. జూన్ 7న థియేటర్స్ విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి యూనిట్‌కు తన స్నేహితుడు శర్వానంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Manamey: ‘మనమే’ మ్యాజికల్ బ్లాక్‌బస్టర్ సినిమా.. రాసిపెట్టుకోండి
Manamey Movie Trailer Launch Event

శర్వానంద్ (Sharwanand), కృతి శెట్టి (Krithi Shetty) హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మనమే’ (Manamey). జూన్ 7న థియేటర్స్ విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ (Manamey Movie Trailer)ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి యూనిట్‌కు తన స్నేహితుడు శర్వానంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో

Also Read: Super Star Krishna Brother: ఈ ఫొటోలో ఉన్నది కృష్ణ కాదంటే ఎవరైనా నమ్మగలరా?

హీరో శర్వానంద్ (Hero Sharwanand) మాట్లాడుతూ.. ‘‘ఈసారి కుమ్మేశాం. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ఇది రాసిపెట్టుకోండి. దాదాపు 2 ఇయర్స్ అవుతుంది నా సినిమా వచ్చి. ‘మనమే’ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా.. రాసిపెట్టుకోండి. చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. మంచి సినిమా తీశాం. జూన్ 7న సెలబ్రేట్ చేసుకుందాం. ‘మనమే’ మన తల్లితండ్రులకు డెడికేట్ చేస్తున్న సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా. ‘శతమానం భవతి’ కంటే డబుల్ హిట్ కావాలని కోరుకుంటున్నా.. అవుతుందనే నమ్మకం కూడా వుంది. నమ్మకంతో చెబుతున్నా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్. జూన్ 7 ఫ్యామిలీతో కలిసి చూడండి. వన్ పర్సంట్ కూడా డిజప్పాయింట్ చేయదు. మంచి సినిమా చూసి వెళ్తారనే హామీ నేనిస్తా. స్వామీ శరణం’’ అని అన్నారు.


Sharwanand.jpg

హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) మాట్లాడుతూ.. ట్రైలర్ కంటే ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది సినిమా. సినిమాలో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు అందమైన ఎమోషన్ వుంది. త్రీ జనరేషన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారు. శర్వాగారు వండర్ ఫుల్ పెర్ఫార్మర్. ఆయన‌తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ క్యారెక్టర్ చేయడం నా లైఫ్‌లో వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని తెలపగా.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) మాట్లాడుతూ.. ట్రైలర్‌లో మీరు చూసింది కొంచమే. సినిమాలో చాలా వుంది. థియేట్రికల్‌గా ఈ సినిమా మోస్ట్ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అన్ని ఏజ్ గ్రూప్స్‌కి ఇది కిక్-యాస్ ఫిల్మ్. నా కెరీర్‌లో మనమే ఒక మ్యాజిక్. ఆ మ్యాజిక్‌ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్.. అని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Jun 01 , 2024 | 10:33 PM