Manamey: ఓ మ‌న‌మే.. మ‌న‌మే.. అదిరిపోయిన‌ శ‌ర్వానంద్ మాప్ స్టెప్

ABN , Publish Date - May 26 , 2024 | 10:41 AM

శర్వానంద్, కృతి శెట్టి జంట‌గా న‌టిస్తోన్న కొత్త చిత్రం మ‌న‌మే. తాజాగా ఈ సినిమా నుంచి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతంలో ఓ మ‌న‌మే మ‌న‌మేఅంటూ సాగే సెల‌బ్రేష‌న్ పాట‌ను విడుద‌ల చేశారు.

Manamey: ఓ మ‌న‌మే.. మ‌న‌మే.. అదిరిపోయిన‌ శ‌ర్వానంద్ మాప్ స్టెప్
Manamey

శర్వానంద్ (Sharwanandh), కృతి శెట్టి (KrithiShetty) జంట‌గా న‌టిస్తోన్న కొత్త చిత్రం మ‌న‌మే (Maname). శర్వానంద్ 35వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వం వ‌హించ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన గ్లింప్స్, పాట‌లు, టీజ‌ర్‌ల‌కు అద్భుత స్పంద‌న రాగా తాజాగా ఇప్పుడు ఓ మ‌న‌మే మ‌న‌మే (Oh Manamey) అంటూ సాగే సెల‌బ్రేష‌న్ పాట‌ను విడుద‌ల చేశారు.

Manamey

ఇటీవ‌ల ఖుషి, హాయ్ నాన్న వంటి సినిమాల‌కు సంగీతం అందించిన హేషామ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) ఈ చిత్రానికి మ్యూజిక్ అందించ‌గా పాట‌లు అన్నీ మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ పొజిషన్ లో నిలిచాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఓ మ‌న‌మే మ‌న‌మే (Oh Manamey) అనే పాట‌కు కృష్ణకాంత్ సాహిత్యం అందించ‌గా కార్తీక్ , గీతా మాధురి ఆల‌పించారు. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట‌లో శ‌ర్వానంద్ (Sharwanandh) మాప్ స్టెప్ అదిరిపోయింది. అదేవిధంగా కృతి.. శ‌ర్వా కెమిస్ట్రీ కూడా చూడ‌చ‌క్క‌గా ఉంది.


Manamey

ఇదిలాఉండ‌గా ఈ మనమే (Maname) సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానుంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్లు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.

Updated Date - May 26 , 2024 | 10:41 AM