Ram Gopal Varma: ఇక నా సినిమాలు నేను చేసుకుంటా... వాటి జోలికి వెళ్ళను 

ABN , Publish Date - Apr 06 , 2024 | 02:47 PM

"రాజకీయాలు, రాజకీయ నేపధ్య  సినిమాలకు ఇకపై దూరంగా ఉంటా. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనుకుంటున్నా. ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలని, సినిమా మేకింగ్‌లో కూడా ప్రేక్షకులను ఇన్‌వాల్వ్‌ చేయాలనుకుంటున్నా’’ అని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు.

Ram Gopal Varma: ఇక నా సినిమాలు నేను చేసుకుంటా... వాటి జోలికి వెళ్ళను 
Ram Gopal Varma

"రాజకీయాలు, రాజకీయ నేపధ్య  సినిమాలకు ఇకపై దూరంగా ఉంటా. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనుకుంటున్నా. ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలని, సినిమా మేకింగ్‌లో కూడా ప్రేక్షకులను ఇన్‌వాల్వ్‌ చేయాలనుకుంటున్నా’’ అని వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ramgopal Varma) అన్నారు. ఒకనొక సమయంలో అర్థవంతమైన చిత్రాలు చేసి సూపర్‌డూపర్‌ హిట్‌ చేసిన ఆయన కొంతకాలంగా  ఆ బ్రాండ్‌కే దూరంగా ఉన్నారు. ఆర్‌జీవీ గొప్ప టెక్నీషియన్ అనే పేరును (కొంతకాలంగా ఆయన ఎంచుకున్న కథలతో చెడగొట్టుకున్నారు. ఇప్పుడు రూట్‌ మార్చానని చెబుతున్నారు. ఈ మేరకు 'యువర్ ఫిల్మ్' (Yours Film) పేరుతో ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆయన లాంచ్  చేశారు. మెజారిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఎంచుకున్నట్లు తమకు నచ్చే సినిమాను ఆడియన్స్‌ లైక్స్‌ ఆదారంగా డెమోక్రటిక్‌  విధానంలో చేయనున్నారు వర్మ. ఈ మేరకు శనివారం ఆయన  విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ " ఏ సపోర్ట్‌ లేని ప్రతిభావంతులను ఎంకరేజ్‌ చేయాలన్నదే మా ఆలోచన. సినిమాకు సంబందించిన అన్నీ విభాగాల్లోనూ ది బెస్ట్‌ టాలెంట్‌ ఆడియన్స్‌ ద్వారానే గుర్తిస్తాం. అనంతరం వారితో మేం సినిమా తీస్తాం. క్రౌడ్‌ ఫండెడ్‌ ఆలోచన కూడా ఉంది’ అని అన్నారు.

Rgv 2.jpg

ఇప్పుడు హీరోల రెమ్యూనిరేషన్స్‌ అసలు మ్యాటరే కాదు. స్టార్‌ హీరోల ఇమేజ్‌ తగ్గ సినిమాలు చేయలేను. వారి ఇమేజ్‌కి తగ్గ సినిమాలు నేను చేయలేను. గతంలో కూడా ఈ విషయం చెప్పాను. నాకు ఆ కెపాసిటీ లేదు. నేను ఎప్పుడు రియలిస్టిక్‌, డార్క్‌ జానర్‌ సినిమాలు చేశాను. జోనర్‌ బెస్ట్‌ సినిమాలనే చేశాను.  వివేకం సినిమా పూర్తిగా చూడలేదు. అక్కడక్కడా సోషల్‌ మీడియాలో వివేకం సీన్స్‌  చూశాను. పిఠాపురంలో  పోటీ అనే ట్వీట్‌ ఇరిటేట్‌ చేయాలని వేశాను’’ అని ఆర్‌జీవీ చెప్పారు.



అలాగే ఆస్కార్‌ అవార్డుల గురించి కూడా వర్మ మాట్లాడారు. ఆస్కార్‌ అవార్డుల వెనుక  ఉన్నది మార్కెటింగ్‌ టెక్నిక్కె. దానికోసం ప్రయత్నించటంలో తప్పేమి లేదు. నేను ఎక్కువగా హాలీవుడ్‌ సినిమాలనే చూస్తాను. ఓపెన్‌ హైమర్‌ ఈ మఽధ్య వచ్చిన  బెస్ట్‌ మూవీ’’ అని తెలిపారు.

Sree Mukhi: పాన్ ఇండియా హీరోతో.. రెండోసారి 


Updated Date - Apr 06 , 2024 | 03:14 PM