Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ నయా అప్డేట్

ABN , Publish Date - Jan 04 , 2024 | 02:48 PM

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఇందులో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అప్‌డేట్‌ని వదిలారు. 35 రోజుల పాటు సాగిన షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ 90శాతం పూర్తయ్యిందని.. ఈ షెడ్యూల్‌లో హ్యూజ్ యాక్షన్ సీన్స్‌‌ను కాజల్ అగర్వాల్‌‌పై ఫైట్ మాస్టర్ సుబ్బు చిత్రీకరించినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ నయా అప్డేట్
Kajal Aggarwal

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). ఇందులో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్కా సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. సుమన్ చిక్కాల (Suman Chikkala) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

నవంబర్, డిసెంబర్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుందీ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసినట్లుగా మేకర్స్ తెలిపారు. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ 90శాతం పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌లో హ్యూజ్ యాక్షన్ సీన్స్‌‌ను కాజల్ అగర్వాల్‌‌పై ఫైట్ మాస్టర్ సుబ్బు చిత్రీకరించినట్లుగా మేకర్స్ ప్రకటించారు. (Satyabhama Shooting Update)


Kajal.jpg

కాజల్ గతంలో ఎప్పుడూ కనిపించని యాక్షన్ మోడ్‌లో ఈ ‘సత్యభామ’లో కనిపించబోతోంది. కాజల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి ఈ యాక్షన్ సీక్వెన్సులు కంప్లీట్ చేసిందని.. సినిమాలో ఈ పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టీమ్ నమ్ముతోంది. ఇక ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే ప్రమోషన్స్‌ను, అలాగే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. (Satyabhama Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Sailesh Kolanu: ధైర్యంగా ట్రైలర్‌లోనే కథ చెప్పా.. ఇక మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా!

*******************************

*Indian 2: ‘ఇండియన్‌-2’ విడుదల ఎప్పుడు?

*******************************

*Sriya Reddy: అమ్మతోడు.. ‘పీఎస్‌’ స్టోరీ అర్థం కాలేదు

****************************

*Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..

*****************************

Updated Date - Jan 04 , 2024 | 02:48 PM