Kannappa: మిత్రవిందను మరిపించేలా ‘కన్నప్ప’లో కాజల్ అగర్వాల్..

ABN , Publish Date - May 17 , 2024 | 04:11 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన అప్డేట్‌తో మరోసారి ‘కన్నప్ప’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ వచ్చిన అప్డేట్ ఏమిటంటే.. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రను చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Kannappa: మిత్రవిందను మరిపించేలా ‘కన్నప్ప’లో కాజల్ అగర్వాల్..
Kajal Aggarwal

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa) నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించేసుకోవడం, ఆ వెంటనే డార్లింగ్ ప్రభాస్‌ (Darling Prabhas) సెట్‌లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌.. ఈ సినిమాను నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. తాజాగా వచ్చిన అప్డేట్‌తో మరోసారి నెట్టింట్లో ‘కన్నప్ప’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

*Nagababu: అల్లు ఆర్మీ సెగ.. వివాదం ముదరకుండా ఉండటం కోసమే అలా చేశారా?

ఇంతకీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమిటని అనుకుంటున్నారా.. ‘కన్నప్ప’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆల్రెడీ విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు ‘మోసగాళ్లు’ (Mosagallu) అనే మూవీలో నటించారు. ఇప్పుడు మరోసారి మంచు విష్ణు టైటిల్ రోల్‌లో చేస్తోన్న ‘కన్నప్ప’ చిత్రంలో కాజల్ ఓ కీ రోల్‌ను (Kajal for Kannappa) చేయబోతోంది. ఈ పాత్ర ‘మగధీర’ సినిమాలో మిత్రవిందను మరిపించేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.


Kajal.jpg

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తోన్న ఈ ‘కన్నప్ప’ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎక్కువ శాతం న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేయబోతున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 17 , 2024 | 04:11 PM