Mr Bachchan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్‌’లో జగ్గు భాయ్ అవతార్ చూశారా..

ABN , Publish Date - Apr 07 , 2024 | 09:43 PM

డెడ్లీ కాంబో కోసం గెట్ రెడీ. మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షనర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో రెండు బిగ్ ఫోర్సస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్‌’లో బిజీయెస్ట్ యాక్టర్స్‌లో ఒకరైన జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో జగపతిబాబు నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఆయన లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు.

Mr Bachchan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్‌’లో జగ్గు భాయ్ అవతార్ చూశారా..
Jagapathi Babu in Mr Bachchan

డెడ్లీ కాంబో కోసం గెట్ రెడీ. మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షనర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో రెండు బిగ్ ఫోర్సస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్‌’ (Mr Bachchan)లో బిజీయెస్ట్ యాక్టర్స్‌లో ఒకరైన జగపతి బాబు (Jagapathi Babu) కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో జగపతిబాబు నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఆయన లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు.

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..


ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో జగపతి బాబు ఇంటెన్స్, ఫెరోషియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చెస్ మూవ్‌ని చేతిలో పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న లుక్ అదిరిపోయిందనే చెప్పాలి (Jagapathi Babu Look in Mr Bachchan). ‘మిస్టర్ బచ్చన్‌’లో జగపతి బాబు పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారనేలా టాక్ వినబడుతోంది. రవితేజ, జగపతిబాబులను తెరపై చూడటం కనుల పండువగా ఉంటుంది. ఇద్దరికీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్‌ని హరీష్ శంకర్ సెట్ చేశాడనేది ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది. అలాగే జగపతి బాబు ఈ పోస్టర్ షేర్ చేసి.. ‘‘మిస్టర్ బచ్చన్‌లో మాస్ మహారాజాని వేసేయడానికి సిద్ధం’’ అని పోస్ట్ చేస్తే.. అందుకు రవితేజ రియాక్ట్ అవుతూ.. ‘‘మిస్టర్ బచ్చన్ ఇక్కడ.. ఎవరు ఎవర్ని వేస్తారో చూసుకుందాం’’ అని ట్వీట్ చేశారు.


Mr-Bachchan.jpg

రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్ర టీమ్ 50 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు దాదాపు 80 శాతం ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని.. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, అయనంక బోస్ కెమెరా డీవోపీగా పని చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

Updated Date - Apr 07 , 2024 | 11:03 PM