Pushpa The Rule: ‘పుష్ప ద రూల్’ విశ్వరూపం.. లుక్ అదిరింది

ABN , Publish Date - Apr 07 , 2024 | 07:05 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘పుష్ప‌: ది రూల్’ నెంబర్ వన్‌ ప్లేస్‌లో ఉంటుంది. ‘పుష్ప ది రైజ్‌’తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న 11:07 నిమిషాల‌కు ఈ చిత్ర టీజ‌ర్‌ విడుదల కానుంది.

Pushpa The Rule: ‘పుష్ప ద రూల్’ విశ్వరూపం.. లుక్ అదిరింది
Pushpa 2 Movie Still

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘పుష్ప‌: ది రూల్’ (Pushpa The Rule) నెంబర్ వన్‌ ప్లేస్‌లో ఉంటుంది. ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise)తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ (Icon Star) న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Director Sukumar) ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న ‘పుష్ప’ పార్ట్ 2పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి. ఇక ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు (Icon Star Allu Arjun) సంద‌ర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఏప్రిల్ 8న 11:07 నిమిషాల‌కు ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

*Allu Arjun: ఆ విగ్రహం చూడగానే సంతోషంగా అనిపించింది


ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నారు. అల్లు అర్జున్ విశ్వరూపం ఎలా ఉండబోతుందో.. జస్ట్ శాంపిల్ అన్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంవ‌త్స‌రం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల (Pushpa 2 Release Date) చేయనున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. సోమవారం (ఏప్రిల్ 8) పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఈ సంవ‌త్స‌రం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌దిగా చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే, మొట్ట‌ మెద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం, మొట్ట‌ మెద‌టిసారిగా ద‌క్షిణ భార‌తదేశ న‌టుడు దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్‌లో (Madame Tussauds Tryst in Dubai) వాక్స్ స్టాట్యూ ఏర్పాటు చేయడమనేది తెలుగు వారంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు ఈ సంవ‌త్సరంలో ఐకాన్ స్టార్ కెరీర్‌లో సంత‌రించుకున్నాయి.


Pushpa-2.jpg

ఇక త్వ‌ర‌లో ‘పుష్ప 2’ (Pushpa 2)తో మ‌రొక్క‌సారి ప్ర‌పంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారు. 90 సంవ‌త్ప‌రాల తెలుగు సినిమా చ‌రిత్రలో మొద‌టిసారి తెలుగు న‌టుడి న‌ట‌న చూసేందుకు ప్ర‌పంచ దేశాల‌న్ని ఎదురుచూస్తున్నాయి. తెలుగు వారంద‌రి గౌర‌వాన్ని తన నటనతో ప్ర‌పంచ శిఖరానికి చేర్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి అప్పుడే సోషల్ మీడియాలో జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు (Happy Birthday Icon Star Allu Arjun) వెల్లువెత్తుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

Updated Date - Apr 07 , 2024 | 07:05 PM