Hit List: ‘హిట్ లిస్ట్’ మూవీ టీజర్ వదిలిన హీరో సూర్య

ABN , Publish Date - May 17 , 2024 | 04:53 PM

తమిళ డైరెక్టర్ విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా.. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘హిట్ లిస్ట్’. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను వెర్సటైల్ యాక్టర్ సూర్య చేతుల మీదగా మేకర్స్ విడుదల చేశారు.

Hit List: ‘హిట్ లిస్ట్’ మూవీ టీజర్ వదిలిన హీరో సూర్య
Hit List Teaser Launch Event

తమిళ డైరెక్టర్ విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క (Vijay Kanishka) హీరోగా.. సముద్రఖని (Samuthirakani), శరత్ కుమార్ (Sarath Kumar), గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautham Vasudev Menon) ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘హిట్ లిస్ట్’ (Hit List). సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ (KS Ravikumar) ఈ సినిమాను నిర్మించారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను వెర్సటైల్ యాక్టర్ సూర్య (Suriya) చేతుల మీదగా మేకర్స్ విడుదల చేశారు.

*Nagababu: అల్లు ఆర్మీ సెగ.. వివాదం ముదరకుండా ఉండటం కోసమే అలా చేశారా?


Hit-List.jpg

టీజర్ విడుదల అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ (Suriya about Hit List Teaser).. ‘హిట్ లిస్ట్’ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా విజయ్ కనిష్కకి, అలాగే ఈ టీమ్‌కి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్న క్రైమ్, సస్పెన్స్ జానర్ మూవీ కావడంతో.. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే టీజర్ విడుదల చేసిన హీరో సూర్యకు వారు ధన్యవాదాలు తెలుపుతూ.. త్వరలోనే ఈ చిత్ర విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని అన్నారు. (Hit List Teaser Out)

Read Latest Cinema News

Suriya-Hit-List.jpg

Updated Date - May 17 , 2024 | 04:56 PM