Suriya 43: సూర్య-సుధా కొంగర సినిమాకు టైం కావాలి 

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:29 PM

'సూరారై పోట్రు’ చిత్రం సక్సెస్‌ తర్వాత తమిళ హీరో సూర్య, సుధా కొంగర కలయికలో 'సూర్య43' వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతున్కన సంగతి తెలిసిందే! ఈ చిత్రం నిర్మాణం తాత్కాలికంగా వాయిదా పడింది.

Suriya 43:  సూర్య-సుధా కొంగర సినిమాకు టైం కావాలి 

'సూరారై పోట్రు’ చిత్రం సక్సెస్‌ తర్వాత తమిళ హీరో సూర్య, సుధా కొంగర కలయికలో 'సూర్య43' వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతున్కన సంగతి తెలిసిందే! ఈ చిత్రం నిర్మాణం తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్‌ వేదికగా తెలిపారు. ‘‘పురాణనూరు చిత్రీకరణ అధిక సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ చిత్రం మా హృదయాలకు ఎంతో చేరువైంది. అంతే ప్రత్యేకం కూడా. అందుకే ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’’  అని పేర్కొంది.


దీనిపై నెటిజన్లు కామెంట్‌ పెడుతున్నారు. ‘ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మీ కాంబినేషన్‌లో వచ్చిన ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కూడా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అని నెటిజన్ల పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇందులో మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, నజ్రియా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. జీవీ ప్రకాశ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో ‘కంగువా’లో నటిస్తున్నారు. దిశా పఠానీ కథానాయిక. బాబీ దేవోల్‌ విలనగా నటిస్తున్నారు. జగపతి బాబు, యోగిబాబు కీలక పాత్రధారులు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - Mar 19 , 2024 | 04:29 PM