Hello Baby: మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా పాట విడుదల

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:52 AM

ఎస్‌కె‌ఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘హలో బేబీ’. ఈ చిత్రంలోని ఒక పాటను తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి విడుదల చేశారు. ‘హలో బేబీ’ అంటూ సాగే ఈ పాటకు సాదిక్ ఇమ్రాన్ రచన మరియు గాత్రం కూడా అందించడం జరిగింది. పాట విడుదల అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రానికి నేను ఎందుకు మ్యూజిక్ ఇవ్వలేదా అని బాధపడుతున్నానని అన్నారు.

Hello Baby: మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా పాట విడుదల
Hello Baby Song Launch Event

ఎస్‌కె‌ఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ (SKML Motion Pictures) నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘హలో బేబీ’ (Hello Baby). ఈ చిత్రంలోని ఒక పాటను తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి (Music Director Koti) విడుదల చేశారు. ‘హలో బేబీ’ అంటూ సాగే ఈ పాటకు సాదిక్ ఇమ్రాన్ (Sadeeq Imran) రచన మరియు గాత్రం కూడా అందించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ సోలో క్యారెక్టర్ చిత్రమైన ఈ ‘హలో బేబీ’లో కావ్య కీర్తి (Kavya Keerthi) ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

*Robinhood: క్రిస్మ‌స్‌కు.. నితిన్ రాబిన్‌హుడ్


పాట విడుదల అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రంలో నేను ఎందుకు మ్యూజిక్ ఇవ్వలేదా అని బాధపడుతున్నాను. ఇదొక వినూత్నమైన చిత్రం. ఇది కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. కథ వినగానే నేనే ఆశ్చర్యపోయా. ప్రేక్షకులకి నచ్చే చిత్రం తీసినందుకు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణకు మరియు యూనిట్‌కి ఆల్ ద బెస్ట్ అన్నారు.


Hello-Baby-Song-Launch.jpg

పాట విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపిన మ్యూజిక్ డైరెక్టర్ కోటికి కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత ఆదినారాయణ కాండ్రేగుల (Kandregula Adinarayana). ‘హలో బేబీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాంగోపాల్ రత్నం (Ramgopal Ratnam), కెమెరామెన్ రమణ కే నాయుడు, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి, మ్యూజిక్ సుకుమార్ పమ్మిలు అద్భుతమైన పనితనం కనబరిచారని.. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటారని ఆయన చెప్పుకొచ్చారు.

Updated Date - Apr 18 , 2024 | 12:14 PM