scorecardresearch

Robinhood: క్రిస్మ‌స్‌కు.. నితిన్ రాబిన్‌హుడ్

ABN , Publish Date - Apr 17 , 2024 | 09:26 PM

నితిన్, వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం రాబిన్‌హుడ్. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు,

Robinhood: క్రిస్మ‌స్‌కు.. నితిన్ రాబిన్‌హుడ్
nithin

నితిన్ (nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). మునుపెన్నడూ చూడ‌ని కొత్త తరహా పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడు. గెటప్ నుంచి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్‌ను డిఫరెంట్ క్యారెక్టర్‌లో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే నితిన్ క్యారెక్ట‌ర్‌ను దొంగగా పరిచయం చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ro.jpeg


ఇదిలా ఉండగా తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల నేప‌థ్యంలో రాబిన్‌హుడ్ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. సాయి శ్రీరామ్ లెన్స్మెన్, జివి ప్రకాష్ కుమార్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 09:31 PM