Hello Baby: ‘హలో బేబీ’కి బెస్ట్ కాన్సెప్ట్ ఫిల్మ్ అవార్డ్.. ఎక్కడంటే

ABN , Publish Date - Feb 07 , 2024 | 08:49 PM

SKML మోషన్ పిక్చర్స్ పతాకంపై.. రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘హలో బేబీ’. కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించారు. సోలో పాత్రలో మొట్టమొదటి భారతీయ హ్యాకింగ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా.. విడుదలకు ముందే ఈ చిత్రానికి అవార్డుల పంట పండుతోంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో అవార్డ్స్‌లో బెస్ట్ కాన్సెప్ట్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకుంది.

Hello Baby: ‘హలో బేబీ’కి బెస్ట్ కాన్సెప్ట్ ఫిల్మ్ అవార్డ్.. ఎక్కడంటే
Hello Baby Poster

SKML మోషన్ పిక్చర్స్ పతాకంపై.. రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘హలో బేబీ’. కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించారు. సోలో పాత్రలో మొట్టమొదటి భారతీయ హ్యాకింగ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా.. విడుదలకు ముందే ఈ చిత్రానికి అవార్డుల పంట పండుతోంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో అవార్డ్స్‌లో బెస్ట్ కాన్సెప్ట్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకుంది.

తిరుపతిలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును నటి నందితా శ్వేత చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ అవార్డు రావడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ఇంకా ఎన్నో అవార్డులు వస్తాయనే నమ్మకంతో ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 200కి పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అలాగే హిందీలో కూడా రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ తెలిపారు.


Andhra-pradesh.jpg

ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలతో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ నుండి యుబైఏ సర్టిఫికేట్‌ని సొంతం చేసుకుంది. భారతీయ సినీ ఇండస్ట్రీలో సింగిల్ పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాపై సెన్సార్ వారు ప్రశంసలు కురిపించినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు రమణ కె నాయుడు సినిమాటోగ్రఫీ, సుకుమార్ పమ్మి సంగీత బాధ్యతలను నిర్వర్తించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Lal Salaam Trailer: ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. తలైవా డైలాగ్ వైరల్

*************************

*Vishal: పొలిటికల్ ఎంట్రీ, నూతన పార్టీ వార్తలపై విశాల్ ఏమన్నారంటే..

***********************

*Kiran Abbavaram: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్

**************************

*RRR: జక్కన్నపై మరోసారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రశంసలు

******************************

Updated Date - Feb 07 , 2024 | 08:49 PM