Hello Baby: దేశంలోనే.. హాకింగ్ విత్ సొలో క్యారెక్టర్‌తో వ‌స్తున్న మొట్టమొదటి చిత్రం ‘హలో బేబీ’

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:35 PM

భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సొలో క్యారెక్టర్ తో నిర్మించబడ్డ చిత్రం ‘హలో బేబీ’. హీరోయిన్ కావ్య కీర్తి ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించారు.

Hello Baby: దేశంలోనే.. హాకింగ్ విత్ సొలో క్యారెక్టర్‌తో వ‌స్తున్న మొట్టమొదటి చిత్రం ‘హలో బేబీ’
HELLO BABY

భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సొలో క్యారెక్టర్ తో నిర్మించబడ్డ చిత్రం ‘హలో బేబీ’ (HELLO BABY ). ఎస్ కె ఎల్ ఎమ్ పిక్చర్స్ నిర్మాణంలో హీరోయిన్ కావ్య కీర్తి (Kavya Keerthi) ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ (Kandregula Adhinarayana) నిర్మించారు.

WhatsApp Image 2024-02-20 at 4.06.16 PM.jpeg

ఈ సినిమా పోస్టర్ ను దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పోస్టర్ చూడ్డానికి హాలీవుడ్ స్టైల్ లో ఉందని కొత్త ద‌నాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. ప్రొడ్యూసర్ ఆదినారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు .


ప్రొడ్యూసర్ ఆదినారాయణ మాట్లాడుతూ ఇది చాలా డిఫరెంట్ మూవీ అని. ఈ సినిమా.. చేస్తున్న‌ప్పుడే కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో చేసామని,దర్శకుడు రామ్ గోపాల్ రత్నం (RAM GOPAL RATNAM) అద్భుతంగా తెరకెక్కించాడ‌ని అన్నారు. హీరోయిన్ కావ్య కీర్తి (Kavya Keerthi) నటన అద్భుతంగా న‌టించింద‌ని కొనియాడారు.

WhatsApp Image 2024-02-20 at 4.06.16 PM (1).jpeg

ఒక అమ్మాయి మొబైల్‌ను హ్యాక్ చేస్తే ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనే కథతో సినిమాని అద్భుతంగా తీశామని అతి త్వరలో సినిమా రిలీజ్ కూడా కాబోతుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి కెమెరామెన్ రమణ.కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి.

Updated Date - Feb 20 , 2024 | 05:35 PM