Hello Baby: హీరో నవీన్ చంద్ర వదిలిన ప్రమోషనల్ సాంగ్

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:18 PM

ఎస్ కె యల్ ఎమ్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా, రాంగోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి నటించిన చిత్రం ‘హలో బేబీ’. తాజాగా ఈ చిత్ర ప్రమోషనల్ సాంగ్‌ను హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ‘హల్లో బాయ్స్ లెట్స్ డు పార్టీ’ అని మొదలుపెట్టిన ఈ పాటను సింగర్ సాయి చరణ్ ఆలపించగా.. రాజేష్ లోక్‌నాథం సాహిత్యం అందించారు.

Hello Baby: హీరో నవీన్ చంద్ర వదిలిన ప్రమోషనల్ సాంగ్
Hello Baby Promotional song Launch

ఎస్ కె ఎమ్ యల్ మోషన్ పిక్చర్స్ (SKML Motion Pictures) పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా, రాంగోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి (Kavya Keerthi) నటించిన చిత్రం ‘హలో బేబీ’ (Hello Baby). తాజాగా ఈ చిత్ర ప్రమోషనల్ సాంగ్‌ను హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ‘హల్లో బాయ్స్ లెట్స్ డు పార్టీ’ అని మొదలుపెట్టిన ఈ పాటను సింగర్ సాయి చరణ్ ఆలపించగా.. రాజేష్ లోక్‌నాథం సాహిత్యం అందించారు.

పాట విడుదల అనంతరం హీరో నవీన్ చంద్ర (Hero Naveen Chandra) మాట్లాడుతూ.. సోలో క్యారెక్టర్‌లో భారతదేశంలోనే మొట్టమొదటి హ్యాకింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి ఆల్ ద బెస్ట్. ఇలాంటి చిత్రాలు చేయడానికి నిజంగా సాహసం ఉండాలి. అలాంటి సాహసం చేసిన నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ‌కు, దర్శకుడు రామ్ గోపాల్ రత్నం‌కు, ఇతర టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.


Hello-Baby.jpg

నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ (Kandregula Adhinanayana) మాట్లాడుతూ.. మా చిత్ర ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రకు ధన్యవాదాలు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ పాట కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. దీనిని కొరియోగ్రాఫర్‌ మహేష్ చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సుకుమార్ పమ్మి, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి. ఈ చిత్రం ఒకే ఒక క్యారెక్టర్‌తో నడుస్తోంది. ఆ పాత్రలో కావ్య కీర్తి తన నటనతో అందరినీ రంజింపజేయనుంది. కొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నానని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?

*****************************

*Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ రివీలైందోచ్..

Updated Date - Mar 27 , 2024 | 11:18 PM