Hebah Patel: హెబ్బా పటేల్ తన అందాలతో హీట్ పుట్టిస్తోంది

ABN , Publish Date - May 04 , 2024 | 02:52 PM

మొదటి సినిమా 'అలా ఎలా' తో అందరి ప్రశంశలు పొందిన హెబ్బా పటేల్, రెండో సినిమా 'కుమారి ఎఫ్21' సినిమాతో తన ప్రతిభ ఏంటో నిరూపించింది. ఇక అక్కడ నుండి వరసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హెబ్బా కి ఈమధ్యకాలంలో 'ఓదెల రైల్వే స్టేషన్' లో చేసిన పాత్రకి గాని మంచి ప్రశంశలు వచ్చాయి. ఇప్పుడు ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Hebah Patel: హెబ్బా పటేల్ తన అందాలతో హీట్ పుట్టిస్తోంది
Hebah Patel

హెబ్బా పటేల్ అంటే తెలుగు ప్రేక్షకులకి అంతగా పరిచయం అక్కరలేని పేరు. ముందుగా కన్నడ పరిశ్రమలో ఆరంగేట్రం చేసి, ఆ తరువాత తమిళంలో కూడా కాలు పెట్టి, అప్పుడు తెలుగులోకి 'అలా ఎలా' అనే సినిమాతో పరిచయం అయిన నటి హెబ్బా పటేల్. మొదటి సినిమాతోటె మంచి పేరు సంపాదించుకున్న నటి హెబ్బా. (Hebah Patel photos going viral on social media)

hebahpatelnewphoto.jpg

రెండో సినిమా ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా చాలా పెద్ద విజయాన్ని ఇచ్చింది. 'ఆ సినిమా మరేదో కాదు 'కుమారి ఎఫ్ 21', ఇది ఆమెకి రెండో తెలుగు సినిమా, ఇందులో రాజ్ తరుణ్ కథానాయకుడు. సుకుమార్ దగ్గర పనిచేసిన పల్నాటి సూర్యకుమారి ప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు. ఇందులో హెబ్బా పటేల్ చేసిన పాత్రకి విమర్శకుల దగ్గర నుండి మంచి ప్రశంశలు వచ్చాయి.

hebahptelnewphoto.jpg

'కుమారి ఎఫ్ 21' తో యువతలో మంచి క్రేజ్ ని సంపాదించింది హెబ్బా పటేల్. తరువాత వరసగా చాలా సినిమాలు చేసినా ఈమధ్య కాలంలో ఆమెకి మళ్ళీ మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా 'ఓదెల రైల్వే స్టేషన్' అనే చెప్పాలి. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తోంది. ఇందులో తమన్నా ఒక ముఖ్యపాత్ర పోషిస్తోంది.

hebahpatellatestphoto.jpg

హెబ్బా పటేల్ సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా చురుకుగా ఉంటూ, అప్పుడప్పుడూ మంచి గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మది దోచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ కుర్రకారును వృరోతలూగిస్తోంది.

హెబ్బా చేతిలో రెండు మూడు చిన్న సినిమాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు పెద్దగా బ్రేక్ రాకపోయినా అటు తమిళం, ఇటు తెలుగులోనూ సినిమాలను చేసుకుంటూ బిజీ గా ఉంటున్న నటి హెబ్బా పటేల్.

Updated Date - May 04 , 2024 | 02:52 PM