Hebah Patel : అలాంటి లేడీస్‌ ఉంటారా అనిపిస్తుంది!

ABN , First Publish Date - 2023-10-05T13:57:41+05:30 IST

మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ అక్టోబర్‌ 6 నుంచి ఆహాలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. విప్లవ్‌ కోనేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ కథానాయిక.

Hebah Patel  : అలాంటి లేడీస్‌ ఉంటారా అనిపిస్తుంది!

మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ (The Great Indian Suicide) అక్టోబర్‌ 6 నుంచి ఆహాలో ఓటీటీ (Aha ott) స్ట్రీమింగ్ కానుంది. విప్లవ్‌ కోనేటి (Viplav koneti) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ (hebah Patel) కథానాయిక.. నరేశ్‌ వీకే, పవిత్రా లోకేశ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెబా పటేల్‌ మాట్లాడుతూ ుూపూర్తిగా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రమిది. నాలో కొత్త యాంగిల్‌ చూస్తారు. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ ఇది’’ అని అన్నారు.

Aha.jpeg

దర్శకుడు విప్లవ్‌ కోనేటి మాట్లాడుతూ "బలమైన కథతో రూపొందిన థ్రిల్లర్‌ ఇది. ఇందులో డిఫరెంట్‌ హెబ్బాను చూస్తారు. తన నటనలోని అన్ని రకాల యాంగిల్స్‌ బయటపెట్టింది. రామ్‌ కార్తీక్‌ను మిగతా వాళ్ళు తనని డామినేట్‌ చెయ్యకుండా, తనని తానూ ప్రూవ్‌ చేసుకున్నాడు. నరేష్‌ గారు తక్కువ సీన్స్‌ చేసిన ఎక్కువ ఇంపాక్ట్‌ ఉంటుంది. ఈ సినిమాలో పవిత్ర లోకేష్‌ గారి క్యారెక్టర్‌ చూేస్త బయట ఇలాంటి లేడీస్‌ ఉంటారా అనిపిస్తుంది’’ అని అన్నారు.

*

Updated Date - 2023-10-05T13:57:41+05:30 IST