Sampath Nandi: ‘సౌండ్ పార్టీ’.. మరో ‘జాతిరత్నాలు’ అయ్యే సినిమా..

ABN , First Publish Date - 2023-08-18T20:22:45+05:30 IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా.. ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1గా రూపొందుతోన్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది విడుదల చేశారు.

Sampath Nandi: ‘సౌండ్ పార్టీ’.. మరో ‘జాతిరత్నాలు’ అయ్యే సినిమా..
Sound Party Movie Teaser Launch Event

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 (Bigg Boss Telugu Season 5) టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ (VJ Sunny) హీరోగా.. ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1గా రూపొందుతోన్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. హ్రితిక శ్రీనివాస్ (Hritika Srinivas) హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ (Jaya Shankar) సమర్పణ. సంజ‌య్ శేరి (Sanjay Sheri) ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల‌ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi).. చిత్ర టీజర్‌ను విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


టీజర్ విడుదల అనంతరం సంప‌త్ నంది మాట్లాడుతూ.. నేను కూడా గ‌తంలో కొన్ని చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రించాను. అదే బాట‌లో జ‌య‌శంక‌ర్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తున్నాడు. ఈ ట్రెడిష‌న్‌ని ఇలాగే కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నా. ‘సౌండ్ పార్టీ’ విషయానికి వస్తే.. టీజ‌ర్ చాలా బాగుంది. అలాగే మోహిత్ చేసిన మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఈ చిత్రం మ‌రో ‘జాతిర‌త్నాలు’ సినిమాలా ఉండ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. వీజే స‌న్నికి ఇది మంచి సినిమా అవుతుంది. అంద‌రూ చేతిలో సెల్ ఫోన్, సిగ‌రెట్ ప‌ట్టుకుని తిరుగుతుంటారు.. జ‌య‌శంక‌ర్ మాత్రం పుస్త‌కం ప‌ట్టుకుని తిరుగుతుంటాడు. ఈ క్వాలిటీ న‌చ్చి నేను అతనికి ‘పేప‌ర్ బాయ్’ సినిమా డైర‌క్ష‌న్ చేసే అవ‌కాశం ఇచ్చాను. ఈ సౌండ్ పార్టీ సినిమా అంద‌రికీ మంచి పేరు తేవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. (Sound Party Movie Teaser Launched)

Sound-Party.jpg

సెప్టెంబర్‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. యంగ్ టాలెంట్‌ని ఎంక‌రేజ్ చేస్తూ.. న్యూ ఏజ్ స్టోరీస్‌తో సినిమాలు చేయాల‌న్న సంక‌ల్పంతో ఫుల్ మూన్ ప్రొడ‌క్ష‌న్స్ (Full Moon Media Productions) స్థాపించాము. ఇక మీద‌ట కంటిన్యూ‌గా మా బేన‌ర్ నుండి సినిమాలు వస్తాయ‌ని నిర్మాత రవి పోలిశెట్టి తెలపగా.. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మోహిత్ రెహమానిక్ మాట్లాడుతూ.. ఈ సినిమా అవ‌కాశం రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం స‌న్నీ. అలాగే జ‌య‌శంక‌ర్ గారు, మా డైరెక్ట‌ర్ సంజ‌య్ గారు ఎంతో స‌పోర్ట్ చేసి మంచి మ్యూజిక్ చేయ‌డానికి స‌హ‌క‌రించారు. సంపత్ నందిగారు వ‌చ్చి మా టీజ‌ర్ లాంచ్ చేసి మా టీమ్‌ని బ్లెస్ చేయ‌డం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.


స‌మ‌ర్ప‌కుడు జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ.. మా హీరో వీజే స‌న్నికి హ్యాపీ బ‌ర్త్‌డే. సంప‌త్ నందిగారు వ‌చ్చి మా ‘సౌండ్ పార్టీ’ సినిమా టీజర్ లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. నేను సినిమా ఇండ‌స్ట్రీలో ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కార‌ణం సంప‌త్ నందిగారు. ఆయ‌నే నాకు ద‌ర్శ‌కుడిగా మొద‌టి అవ‌కాశాన్ని క‌ల్పించారు. మ‌నతో మొద‌టి నుండి ట్రావెల్ చేసేవాళ్ల‌కు, మ‌న‌కు తోడుగా ఉండేవాళ్ల‌కు మ‌నం కూడా స‌పోర్ట్ చేయాల‌ని సంప‌త్‌గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అందులో భాగంగానే ఇది నేను చేయాల్సిన సినిమా అయినా.. ప్రొడ్యూస‌ర్స్‌ని క‌న్విన్స్ చేసి ఈ సినిమా త‌మ్ముడు సంజ‌య్‌తో చేయించాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆద‌రిస్తే ఒక జంధ్యాల‌, ఈవీవీగారి త‌ర‌హా చిత్రాలు సంజ‌య్ నుంచి చాలా వ‌స్తాయని కచ్చితంగా చెప్పగలను. టీమ్ అంతా ఎంతగానో సపోర్ట్ అందించారని తెలపగా.. ‘మ‌నం బాహుబ‌లిలాంటి క‌థ రాసుకున్నా మ‌న వెన‌కాల ఒక బ‌లం ఉండాలి. అలాంటి బ‌ల‌మే జ‌య‌శంక‌ర్ అన్న‌. ఆయ‌న వ‌ల్లే ఈ సినిమా ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది. 28 రోజుల్లో సినిమాను పూర్తి చేయ‌గ‌లిగాము అంటే మా టీమ్ స‌పోర్ట్ వ‌ల్లే.. అని దర్శకుడు సంజయ్ శేరి చెప్పారు.

హీరో వీజే స‌న్ని మాట్లాడుతూ.. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాము. జ‌య‌శంక‌ర్ స‌పోర్ట్‌తో సంజ‌య్ సినిమా చాలా బాగా చేశాడు. శివ‌న్నారాయ‌ణ‌గారు నేను తండ్రీకొడుకులుగా న‌టించాం. సినిమా అంతా ఇద్ద‌రం ఫుల్‌గా నవ్విస్తాం. మోహిత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అంద‌రూ ఫ్యామిలీతో వెళ్లి మా సినిమా చూసి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Dulquer Salmaan: ప్రభాస్ ‘కల్కి’లో దుల్కర్.. చెప్పకనే చెప్పేశాడుగా..

***************************************

*Aadikeshava: మెగా హీరో సినిమా వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

***************************************

*Manchu Vishnu: పవన్ కళ్యాణ్ గెలుస్తాడో.. లేదో చెప్పడానికి నేనేమైనా బ్రహ్మంగారినా?

***************************************

Updated Date - 2023-08-18T20:22:50+05:30 IST