మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Hebah Patel: హెబ్బా... చీరలో ఏముంది కదబ్బా!

ABN , Publish Date - Mar 02 , 2024 | 04:35 PM

హెబ్బా పటేల్ నటించిన 'ఓదెల రైల్వే స్టేషన్' అందరికీ గుర్తుంది కదా, అది రెండేళ్ల క్రితం ఓటిటి లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఓదెల 2' అనే చిత్రం ప్రారంభం అయింది. మరి ఈ సీక్వెల్ లో హెబ్బా పటేల్ నటిస్తోందా, లేదా...

Hebah Patel: హెబ్బా...  చీరలో ఏముంది కదబ్బా!
Hebah Patel

పది సంవత్సరాల క్రితం 'అలా ఎలా' అనే సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసిన నటి హెబ్బా పటేల్. ఆ సినిమా మంచి విజయం సాధించటమే కాకుండా, హెబ్బకి ప్రసంశలు కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత వెంటనే 'కుమారి ఎఫ్ 21' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాకి కథ ప్రఖ్యాత దర్శకుడు సుకుమార్ అందించగా, అతని సోదరుడు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. (Hebah Patel is looking georgeous in a saree)

hebahpateltwo.jpg

ఈ సినిమా హెబ్బా పటేల్ కి మంచి పేరు తీసుకురావటమే కాకుండా, ఆమె నటనని అందరూ ప్రశంసించారు. ఆమె ఈ సినిమాలో ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పాత్ర చేసింది. ఆ తరువాత వరసగా రెండు సినిమాలతో కూడా మంచి విజయాలు సాధించింది హెబ్బా పటేల్. (Hebah Patel is beautiful in saree)

hebahpatel.jpg

హెబ్బా పటేల్ ఇప్పుడు తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించటం లేదు. కానీ వెబ్ సిరీస్, వెబ్ సినిమాలు మాత్రం చేస్తోంది. రెండేళ్ల క్రితం విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' అనే సినిమాలో హెబ్బా పల్లెటూరి అమ్మాయి పాత్ర చేసి మళ్ళీ అందరి ప్రసంశలు అందుకుంది. (Hebha Patel) పాపులర్ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకి కథ ఇచ్చారు, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేరుగా ఓటిటి లో విడుదలయింది.

hebahpatelone.jpg

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ 'ఓదెల 2' అని వస్తోంది. ఈరోజే ఈ సినిమా అధికారికంగా ప్రారంభం అయింది. దీనికి కూడా అశోక్ తేజ దర్శకుడు. తమన్నా భాటియా ఇందులో కథానాయికగా నటిస్తోంది, మరి ఈ సినిమాలో హెబ్బా పటేల్ కనిపిస్తుందో లేదో అని అంటున్నారు.

hebahpatelfour.jpg

హెబ్బా సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా చురుకుగా ఉంటుంది. తన అభిమానులకు తన తాజా ఫోటోలని పోస్ట్ చేస్తూ కనువిందు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చీరలో వున్న ఫోటోలను తాజాగా షేర్ చేసింది హెబ్బా. చీరకట్టులో హెబ్బా చాలా అందంగా వుంది అని చాలామంది కామెంట్స్ పెడుతూ వున్నారు.

Updated Date - Mar 02 , 2024 | 04:35 PM