Gangs of Godavari: విశ్వక్ సేన్ సినిమాకు విడుదల తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-11-27T21:24:12+05:30 IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వినోదాత్మక మరియు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని మరియు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌తో చేతులు కలిపారు. ఈ సినిమాని 2024 మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

Gangs of Godavari: విశ్వక్ సేన్ సినిమాకు విడుదల తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
Gangs of Godavari Movie Still

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass ka Das Vishwak Sen) వినోదాత్మక మరియు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని మరియు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) కోసం రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya) మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sithara Entertainments) బ్యానర్‌తో చేతులు కలిపారు. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, అలాగే ‘సుట్టంలా సూసి’ అనే మెలోడీ సాంగ్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. గ్లామర్ బ్యూటీ నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలెంటెడ్ నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను తెలియజేయనుంది. అతని కఠినమైన ప్రయాణం రాజకీయ చిక్కులను కూడా కలిగి ఉంటుంది. మేకర్స్ వాటి గురించి ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో సూచన చేశారు. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించి.. మరోసారి ఈ సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చేలా చేశారు. (Gangs of Godavari Release Date)


GoG.jpg

ఈ సినిమాని 2024 మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం పట్ల ఎంతో నమ్మకంగా ఆయన, ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించడానికి ఉత్సాహంగా ఉన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సుట్టంలా సూసి’ పాట శ్రోతల మనసు గెలుచుకుని చార్ట్‌బస్టర్స్ నిలిచింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు. (Gangs of Godavari Movie)


ఇవి కూడా చదవండి:

====================

*డైరెక్టర్ క్రిష్ వదిలిన ‘మహేంద్రగిరి వారాహి’ గ్లిమ్స్

***********************************

*Sandeep Reddy Vanga: పక్కా తెలంగాణ బిడ్డని.. ఆ రోజులు తలుచుకుంటే భయమేస్తుంది

******************************

*Geethanjali Sequel: ‘గీతాంజలి’తో అంజలి మళ్లీ వస్తోంది

******************************

Updated Date - 2023-11-27T21:24:15+05:30 IST