Solo Boy: ‘సోలో బాయ్’ సెట్లో గ్రాండ్‌గా బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్

ABN , Publish Date - Apr 14 , 2024 | 09:24 PM

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సోలో బాయ్’. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరో గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

Solo Boy: ‘సోలో బాయ్’ సెట్లో గ్రాండ్‌గా బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్
Gautam Krishna Birthday Celebrations at Solo Boy Sets

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ (Gautam Krishna) హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సోలో బాయ్’ (Solo Boy). సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై పి. నవీన్ కుమార్ (P Naveen Kumar) దర్శకత్వంలో సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ (Seven Hills Satish Kumar) నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరో గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్, సెవెన్ హిల్స్ సతీష్, డైరెక్టర్ నవీన్ కుమార్, అనిత చౌదరి, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్(సూర్య) తదితరులు పాల్గొన్నారు. (Solo Boy Movie)

*Pushpa 2 The Rule: 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో.. సరికొత్త రికార్డ్


ఈ సందర్భంగా డైరెక్టర్ పి. నవీన్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా అవకాశాన్నిచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ గారికి రుణపడి ఉంటాను. ముందుగా గౌతమ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు మంచి సినిమా అనే ఉంటుంది. ‘సోలో బాయ్’ కూడా ఒక మంచి సినిమా. హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, అన్నింటిలోనూ తనదైన శైలితో నటించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మీడియా అలాగే ప్రేక్షకులు మంచి సినిమా వస్తే ఆదరిస్తారు. ఈ సోలో బాయ్ సినిమా కూడా అలాగే ఒక మంచి సినిమా. ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్‌కి, టెక్నీషియన్‌కి కృతజ్ఞతలు. గౌతమ్ కృష్ణ.. ఈ సినిమాతో నాకు సొంత తమ్ముడిలాగా సపోర్ట్ ఇచ్చాడు. గౌతమ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. డైరెక్టర్ నవీన్ చెప్పిన కథ చాలా బాగా అనిపించింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని అన్నారు. (Bigg Boss 7 Gautam Krishna Birthday Celebrations)


solo-Boy.jpg

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. నా పుట్టినరోజున మూవీ టీం ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్నా ఇలా నాకు ఒక టీం ఉంది, నవీన్ అనే ఒక కొత్త డైరెక్టర్ ఉన్నాడు అనగానే కథ విని సింగిల్ సిట్టింగ్లో కథను ఓకే చేశారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్న. ఈ టీమ్ అందరూ కూడా సినిమా మీద ఇష్టంతో పని చేసినవారే. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్‌‌ని తీసుకొస్తున్నాం. నా ఫస్ట్ సినిమా నుంచి, బిగ్ బాస్ జర్నీ నుంచి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి అనితా చౌదరి, డిఓపి త్రీలోక్ మాట్లాడారు.


ఇవి కూడా చదవండి:

====================

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..

****************************

Updated Date - Apr 14 , 2024 | 09:24 PM