Ramoji Rao: రామోజీ రావు ఒక సినిమాలో నటించారు తెలుసా? ఏ సినిమా అంటే...

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:53 PM

ఈనాడు దినపత్రికని ప్రారంభించిన తరువాత, రామోజీ రావు అనేక వ్యాపార రంగాల్లో అడుగుపెట్టారు. అలాగే వినోదాత్మక, సందేశాత్మక సినిమాలు తీయాలని సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఎందరో కళాకారులను, నటీనటులను, సాంకేతికనిపుణలను వెండితెరకి పరిచయం తన సినిమాల ద్వారా పరిచయం చేసిన రామోజీ రావు, ఒక సినిమాలో కూడా నటించారు, ఆ సినిమా ఏదంటే..

Ramoji Rao: రామోజీ రావు ఒక సినిమాలో నటించారు తెలుసా? ఏ సినిమా అంటే...
Ramoji Rao

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిముషాలకి కన్నుమూశారు. రామోజీ రావు, ఈనాడు దినపత్రికతోపాటు అనేక రంగాల్లో తన వ్యాపార సంస్థలు విస్తరించారు. స్వతహాగా కళాభిమాని అయిన రామోజీ రావు చిన్నతనంలో వాళ్ళ వూరిలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. అలాగే రామోజీ రావు మంచి సంగీత ప్రియుడు కూడా. రామోజీ గారికి సినిమాలంటే కూడా ఎంతో ఇష్టం. అతను ఒక సినిమాలో నటించారు కూడా.

రామోజీ రావు నటించిన సినిమా పేరు ఏంటో తెలుసా? యు. విశ్వేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన 'మార్పు' అనే సినిమాలో రామోజీ రావు ఒక అతిధి పాత్రలో కనిపించారు. ఈ సినిమా 1978లో వచ్చింది. ఇందులో రామోజీ రావు న్యాయమూర్తి పాత్ర పోషించారు. రామోజీ రావు నటించింది అతిధి పాత్రలో అయినా, పోస్టర్స్ పై రామోజీ రావు బొమ్మ వేయడం ఆసక్తికరం.

ramojiraoaslawyer.jpg

సినిమాలంటే ఎంతో ఇష్టమున్న రామోజీరావు ఆ తరువాత ఉషాకిరణ్ మూవీస్ సంస్థని ప్రారంభించి, మొదటి సినిమా 'శ్రీవారి ప్రేమలేఖ' తీశారు. సందేశాత్మక, వినోదాత్మక సినిమాలు మాత్రమే తీయాలన్న సంకల్పంతో ఈ సంస్థని ప్రారంభించి అనేక చిత్రాలు తీశారు రామోజీ రావు. మయూరి అనే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసును కూడా మొదలుపెట్టి అనేక చిత్రాలను పంపిణీ చేశారు. ఒక్క తెలుగు చిత్రాలే కాకుండా, పరభాషా చిత్రాలను కూడా తన మయూరి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా పంపిణీ చేశారు.

తన సినిమాల ద్వారా కొన్ని వందలమంది కొత్త తారలను, సాంకేతిక నిపుణలను, కళాకారులను రామోజీ రావు వెండితెరకి పరిచయం చేశారు. అగ్ర నటీమణుల్లో ఒకరైన శ్రియ శరన్ ని రామోజీ రావు పరిచయం చేసిన నటీమణి. 'ఇష్టం' సినిమా ద్వారా శ్రియ శరన్ కథానాయికగా తెలుగు తెరకి పరిచయం అయింది.

Updated Date - Jun 08 , 2024 | 12:58 PM