Ramoji Rao Death: రజనీకాంత్ తో పాటు పలువురు తారలు ఏమన్నారంటే!

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:35 PM

ఈనాడు గ్రూప్స్‌ అధినేత రామోజీరావు మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు.

Ramoji Rao Death: రజనీకాంత్ తో పాటు పలువురు తారలు ఏమన్నారంటే!

ఈనాడు గ్రూప్స్‌ అధినేత రామోజీరావు (Ramojirao) మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు (Film industry bund) రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి (producers council) ఓ ప్రకటన ద్వారా ప్రకటించింది.  అంత్యక్రియలు ఆదివారం ఉదయం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయనకు ఎంతో ఇష్టమైన రామోజీ గ్రూప్స్‌ కేంద్ర కార్యాలయం  లాన్ లో  నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు.

సినీతారల స్పందన...
"నా గురువు, శ్రేయోభిలాషి రామోజీరావు మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. జర్నలిజం, సినిమా రంగాల్లో రామోజీరావు చరిత్ర సృష్టించారు’’ అని తలైవా రజనీకాంత్ (Rajanikanth) అన్నారు.

"నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో రామోజీరావు ఒకరు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు ఆయన చేసిన  సేవలు వరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’
- అల్లు అర్జున్ (Allu arjun)

వరల్డ్‌ నెం.1 చేయాలన్నది ఆయన కోరిక: మురళీమోహన్ (murali mohan)
రామోజీ గ్రూప్‌లో ఎన్నో సంస్థలు నెలకొల్పి ఎంతో మందికి జీవితాలను ఇచ్చారు. నేను ఎప్పుడు వచ్చిన ఆప్యాయంగా పలకరించేవారు. మహోన్నత వ్యక్తి రామోజీరావుగారు. ఫిల్మ్‌సిటీని వరల్డ్‌ నంబర్‌ వన చేయాలన్నది ఆయన కోరిక’’ అని అన్నారు.

"రామోజీరావు నాకు ఎంతో స్ఫూర్తి. సొంత వ్యక్తిత్వంతోనే జీవించాలన్నది ఆయనను చూసే నేర్చుకున్నా. ప్రతి ఒక్కరూ నాయకత్వం లక్షణాలు ఆయన నుంచే నేర్చుకోవాలి. ఆయన మార్గంలో పయనిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు’’

- నిర్మాత డి.సురేష్‌బాబు

"అలెగ్జాండర్‌ ది గ్రేట్‌.. రామోజీ ది గ్రేట్‌ అని నేనెప్పుడూ చెబుతూ ఉంటా. ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి. నేను, రాజ్‌ ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌లో చిత్రాలకు పనిచేశాం. ‘నువ్వే కావాలి’ చిత్రానికి సోలోగా అవకాశం ఇచ్చారు. సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌ రోజున నన్ను ఎంతో మెచ్చుకుని ఆశీర్వదించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’


- సంగీత దర్శకుడు కోటి


"ఒక మహానుభావుడిని మేం కోల్పోయాం. స్టూడియో కట్టేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి సలహాలు అడిగేవారు. అలాంటి గొప్ప వ్యక్తి మాకు దూరమైపోయారు. షూటింగ్‌ సమయంలో ఆయన అందించిన ఏర్పాట్లు ఎంతో ప్రయోజనం కలిగాయి. మయూరి డిస్ర్టిబ్యూషన్‌ ద్వారా చాలా సినిమాలు విడుదల చేశాం’’

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి


Updated Date - Jun 08 , 2024 | 12:57 PM