మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Trivikram Srinivas: ‘ఉషా ప‌రిణ‌యం’ సెట్స్‌లో త్రివిక్రమ్..

ABN, Publish Date - Apr 27 , 2024 | 04:03 PM

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌భాస్క‌ర్. చాలా గ్యాప్ తర్వాత మ‌ళ్లీ ఆయన ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉషా ప‌రిణ‌యం’. తాజాగా ఈ మూవీ సెట్స్‌లో స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ హల్చల్ చేశారు.

Usha Parinayam Team with Trivikram Srinivas

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌భాస్క‌ర్ (K Vijay Bhaskar). చాలా గ్యాప్ తర్వాత మ‌ళ్లీ ఆయన ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి’ వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన కె. విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉషా ప‌రిణ‌యం’ (Usha Parinayam). ‘ల‌వ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కె. విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ (Srikamal) హీరోగా న‌టిస్తుండ‌గా, తాన్వీ ఆకాంక్ష (Tanvi Akanksha) అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటెమ్‌సాంగ్‌ను హీరో శ్రీ‌క‌మ‌ల్‌, హీరోయిన్ సీర‌త్‌క‌పూర్‌ (Seerat Kapoor)పై చిత్రీక‌రిస్తున్నారు.

ఘ‌ల్లు.. ఘ‌ల్లు అనే ఈ సాంగ్‌కు విజ‌య్ పొల్లంకి కొరియోగ్ర‌ఫీ అందిస్తుండగా.. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ సంగీతం అందించారు. అయితే ఈ సాంగ్ చివ‌రి రోజు, చిత్రీక‌ర‌ణ‌ చివ‌రిరోజైన శుక్ర‌వారం ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతున్న సెట్స్‌లో స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ (Trivikram Srinivas) హల్చల్ చేశారు. త్రివిక్ర‌మ్‌, విజ‌య్‌భాస్క‌ర్ క‌ల‌యిక‌లో ఎన్నో సూప‌ర్‌హిట్ సినిమాలు వ‌చ్చాయనే విషయం తెలియంది కాదు. ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ చాలా రోజుల త‌రువాత క‌ల‌వ‌డం కూడా ఒక శుభ‌సూచ‌కం అనే భావించాలి. (Trivikram Srinivas at Usha Parinayam Sets)

Read Latest Cinema News


కె. విజయ్ భాస్కర్ మీద ఉన్న గౌరవంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా సెట్స్‌ను సందర్శంచి.. టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. త్రివిక్రమ్ రాకతో టీమ్ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాగా.. ఈ ఐట‌మ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ పూర్త‌యిన‌ట్లుగా మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్షకులని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కముందని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వారు తెలిపారు. (Usha Parinayam Movie Latest Update)

Updated Date - Apr 27 , 2024 | 04:03 PM