Trivikram: ఐకాన్‌స్టార్‌కు ఆ భవిష్యత్తు దగ్గర్లోనే ఉంది

ABN , First Publish Date - 2023-08-25T16:22:12+05:30 IST

జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని గెలుచుకున్న అల్లు అర్జున్‌కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ‘‘అల్లు అర్జున్‌ సాధించిన ఈ అద్భుతమైన విజయం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఆయన జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతోపాటు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలవడం గర్వంగా ఉంది.

Trivikram: ఐకాన్‌స్టార్‌కు ఆ భవిష్యత్తు దగ్గర్లోనే ఉంది

జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని గెలుచుకున్న అల్లు అర్జున్‌కి (Allu arjun) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (trivikram) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ‘‘అల్లు అర్జున్‌ సాధించిన ఈ అద్భుతమైన విజయం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఆయన జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతోపాటు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలవడం గర్వంగా ఉంది. అల్లు అర్జున్‌ను దగ్గరగా చూసిన వ్యక్తిగా, పాత్రలకు ప్రాణం పోయడం పట్ల ఆయన చూపే శ్రద్థాసక్తులు అసమానమైన అంకితభావం, అభిరుచి స్పష్టంగా నాకు తెలుసు. అతని అసాధారణమైన ప్రతిభ, నిబద్థతను గుర్తించే మరిన్ని పురస్కారాలతో అలంకరించబడిన భవిష్యత్తు దగ్గర్లోనే ఉంది’’ అని అన్నారు. అలాగే అవార్డులు ప్రకటించిన అందరినీ అభినందించారు (Best Actor for Allu Arjun)

‘‘కమర్షియల్‌ సినిమా పాటలకు కొత్త అర్థం చెప్పిన దిగ్గజ స్వరకర్త ఎం.ఎం. కీరవాణి. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి స్మారక చిత్రానికి గానూ ఒకే ఏడాది అటు ఆస్కార్‌, ఇటు జాతీయ పురస్కారం గెలుచుకోవడం అభినందించదగ్గ విషయం. వెండితెరపై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన దృశ్యకావ్యం ఆర్‌ఆర్‌ఆర్‌కి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ అవార్డు పొందిన కాలభైౖరవ, శ్రీనివాస్‌ మోహన్‌, ప్రేమ్‌ రక్షిత్‌, కింగ్‌ సోలమన్‌కు అభినందనలు’’ అని అన్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమా కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని చెప్పారు.

తమ తొలి చిత్రం ఉప్పెనతో సూపర్‌హిట్‌ అందుకోవడంతోపాటు జాతీయ అవార్డును గెలుచుకున్న బుచ్చిబాబు సాన, హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌కు శుభాకాంక్షలు. అలాగే, నేను ఎంతగానో అభిమానించే, గౌరవించే గీత రచయిత చంద్రబోస్‌ గారు ‘కొండపొలం’ సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉంది.

నా సోదరుడు, ఉత్సాహవంతమైన స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డును గెలుచుకోవడం నాకు హృదయం సంతోషంతో నిండిన క్షణం. అతను మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలను కోరుకుంటున్నాను’’ అని త్రివిక్రమ్‌ లేఖలో పేర్కొన్నారు. అలాగే జాతీయ పురస్కారానికి ఎంపికైన తెలుగువారితోపాటు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.

Updated Date - 2023-08-25T16:24:29+05:30 IST